Advertisement
Advertisement
Abn logo
Advertisement

ముగ్గురు పిల్లల తండ్రి.. 17ఏళ్ల అమ్మాయిని బైక్‌పై 200 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు, ఆ తర్వాత స్నేహితుడితో కలిసి..

ఇంటర్నెట్ డెస్క్: అతడు ముగ్గురు పిల్లల తండ్రి. అర్థరాత్రి సమయంలో 17ఏళ్ల అమ్మాయిని ఇంటి నుంచి బయటకు పిలిచి, బైక్‌పై 200 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. ఆ తర్వాత స్నేహితుడికి సమాచారం అందించాడు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న స్నేహితుడితో.. అతడు దారుణానికి పాల్పడ్డాడు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...


రాజస్థాన్‌కు చెందిన తేజ్‌రామ్ అనే వ్యక్తికి కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లైంది. ఈ క్రమంలో అతడికి ముగ్గురు పిల్లలు కూడా జన్మించారు. ముగ్గురు పిల్లలకు తండ్రైనా అతడు నీచంగానే ఆలోచించాడు. స్థానికంగా ఉన్న ఓ 17ఏళ్ల అమ్మాయిపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి, ఆమెను ప్రేమలోకి దించాడు. ఈ క్రమంలోనే అక్టోబర్ 1న ఆ అమ్మాయిని ఇంటి బయటకు పిలిచాడు. అనంతరం ఆమెను బైక్‌పై 200 కిలోమీటర్ల దూరం ఉన్న జోధ్‌పూర్‌కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే అక్కడకు తన స్నేహితుడిని పిలుపించుకున్నాడు. అనంతరం స్నేహితుడితో కలిసి.. 17ఏళ్ల అమ్మాయిని ఓ గదిలో బంధించి, ఏడు రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. 


కాగా.. అక్టోబర్ 12న రాత్రి నుంచి కూతురు కనబడకుండా పోవడంతో మరుసటి రోజు సదరు అమ్మాయి తండ్రి పోలీసుకుల ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతి ఆచూకీ తెలుసుకోవడం కోసం దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే తేజ్‌రామ్ చేసిన దారుణం బటయపడింది. దీంతో తేజ్‌రామ్, అతడి స్నేహితుడిపై కేసు నమోదు చేసిన అధికారులు వారిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. అంతేకాకుండా సదరు అమ్మాయిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement