Advertisement
Advertisement
Abn logo
Advertisement

పని ముగించుకుని ఇంటికి వచ్చిన తండ్రి.. అదే సమయంలో కూతురితో ప్రియుడు సరసాలు.. షాకింగ్ సీన్‌ చూసి ఒక్కసారిగా..

ప్రేమ కథలు చాలా వరకు విషాదాంతమవుతూ ఉంటాయి. కొందరు బాలికలు మాయమాటలు నమ్మి.. జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. తద్వారా కూతుళ్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు శోకాన్ని మిగుల్చుతూ ఉంటారు. కర్ణాటకలో ఓ బాలిక చేసిన పనే ఇందుకు నిదర్శనం. ప్రియుడి మాయలో పడి ఆఖరకు చదువు కూడా మానేసింది. నిత్యం అతడి ధ్యాసలోనే గడిపేది. ఏకంగా ఇంటికే పిలిపించుకుని మరీ ప్రేమాయణం సాగించేది. ఓ రోజు తండ్రి పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఇంట్లో తన కూతురితో పరాయి మగవాడు ఉండడం చూసి షాక్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే..

ప్రతీకాత్మక చిత్రం

కర్ణాటక రాజధాని బెంగళూరులో నారాయణ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతడికి ఓ కూతురు ఉంది. నారాయణ రిక్షా తోలుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. కూతురిని గారాబంగా చూసుకునేవాడు. అయితే బాలిక మాత్రం పక్కింటి కుర్రాడితో ప్రేమలో పడింది. అతడి మాయ మాటలు నమ్మి.. స్కూల్‌కు కూడా సక్రమంగా వెళ్లేది కాదు. ఎవరూ లేని సమయంలో ప్రియుడిని ఇంటికి కూడా పిలిచేది. ఇలా వారి వ్యవహారం కొన్నాళ్లు.. గుట్టుచప్పుడు కాకుండా సాగింది. రోజూ మాదిరే నవంబర్ 28న కూడా.. నారాయణ రిక్షా తోలేందుకు బయటికి వెళ్లాడు. తర్వాత వారి ఇంట్లోకి వచ్చిన యువకుడు.. బాలికతో రాసలీలలు సాగించాడు. అయితే ఆరోజు మాత్రం నారాయణ త్వరగా ఇంటికొచ్చాడు.


భర్తతో సుఖం దొరకలేదని.. పరాయి మగవారిపై మనసు పడింది.. ఓ రోజు చెత్త ఏరుకునే వ్యక్తి ఇంట్లోకి రాగానే..

ఇంట్లోకి అడుగుపెట్టగానే లోపల కూతురితో పాటూ పక్కింటి యువకుడు ఉండడాన్ని చూసి షాక్ అయ్యాడు. ఆగ్రహంతో ఊగిపోయి.. పక్కనే ఉన్న పెద్ద కట్టె తీసుకుని, యువకుడిని చావబాదాడు. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నారాయణ నేరం అంగీకరించడంతో అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. బాలిక చేసిన తప్పు కారణంగా ఇంత ఘోరం జరగడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోయారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement