టీఎస్‌ ఐసెట్‌ మొదటి రోజు ప్రశాంతం

ABN , First Publish Date - 2020-10-01T10:50:29+05:30 IST

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ ఐసెట్‌(ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌)-2020 ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో

టీఎస్‌ ఐసెట్‌ మొదటి రోజు ప్రశాంతం

6 పరీక్ష కేంద్రాలలో 1,803 మంది విద్యార్థులు హాజరు


తిమ్మాపూర్‌, సెప్టెంబరు 30 : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ ఐసెట్‌(ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌)-2020 ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మొదటి రోజు బుధవారం ప్రశాంతంగా జరిగాయి.  పరీక్ష నిర్వహణకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో  తిమ్మాపూర్‌ మండలంలోని వాగేశ్వరి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, శ్రీ చైతన్య కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, శ్రీ చైతన్య ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజికల్‌ సైన్సెస్‌, జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజి అండ్‌ సైన్సెస్‌, కరీంనగర్‌ లోని వివేకానంద ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజి అండ్‌ సైన్సెస్‌, హుజురాబాద్‌లోని కమల ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజి అండ్‌ సైన్సెస్‌ మొత్తం ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.


ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు జరగగా ఆరు పరీక్ష కేంద్రాలలో రెండు సెషన్‌లలో కలిపి 2,045 మందికి 1,803 మంది హాజరు కాగా 242 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని పరీక్ష నిర్వాహకులు తెలిపారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా శానిటైజేషన్‌తోపాటు విద్యార్థులకు థర్మల్‌ స్ర్కినింగ్‌ చేసి విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు

Updated Date - 2020-10-01T10:50:29+05:30 IST