ప్రపంచంలోనే మొట్టమొదటి సారి ఫోన్ ద్వారా పంపిన మెసేజ్ ఏంటో తెలుసా..? సరిగ్గా 30 ఏళ్ల క్రితం నాటి ఆ మెసేజ్‌ వేలం..!

ABN , First Publish Date - 2021-12-18T03:29:15+05:30 IST

గ్రీటింగ్ కార్డుల ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకునే రోజుల్లో మొదటిసారిగా వొడాఫోన్ సెల్ నుంచి ఓ వ్యక్తి తన స్నేహితుడికి టెక్ట్స్ మెసేజ్ పంపాడు. అదేంటో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది. ఈ ఎస్‌ఎమ్ఎస్‌ని ...

ప్రపంచంలోనే మొట్టమొదటి సారి ఫోన్ ద్వారా పంపిన మెసేజ్ ఏంటో తెలుసా..? సరిగ్గా 30 ఏళ్ల క్రితం నాటి ఆ మెసేజ్‌ వేలం..!

ప్రతి ఒక్కరూ తమ గత జ్ఞాపకాలను అప్పుడప్పుడూ నెమరువేసుకుంటూ ఉంటారు. కొందరు చిన్నప్పడు జరిగిన ఘటనలను సైతం డైరీల రూపంలోనో, వీడియోల రూపంలోనో పదిలంగా ఉంచుకుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్నందున చిన్న చిన్న సంఘటనలను సైతం దూరంగా ఉన్న మిత్రులతో పంచుకుంటూ ఉంటారు. అయితే ఒకప్పుడు గ్రీటింగ్ కార్డుల ద్వారా, లెటర్లు రాయడం ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం, సందేశాలు పంపుకోవడం చేస్తుండేవారు. అనంతరం కీపాడ్ పోన్లు రావడంతో టెక్ట్స్ మెసేజ్‌ల ద్వారా సందేశాలు పంపుకొనేవారు. అయితే ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా కీపాడ్ సెల్ ద్వారా పంపిన మెసేజ్‌ను ప్రస్తుతం వొడాఫోన్ సంస్థ వేలం వేస్తోంది...


గ్రీటింగ్ కార్డుల ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకునే రోజుల్లో మొదటిసారిగా వొడాఫోన్ సెల్ నుంచి ఓ వ్యక్తి తన స్నేహితుడికి టెక్ట్స్ మెసేజ్ పంపాడు. అదేంటో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది. ఈ ఎస్‌ఎమ్ఎస్‌ని డిసెంబర్ 3, 1992న ఓ ఉద్యోగి తన సహోద్యోగి అయిన రిచర్డ్ జార్విస్‌కు  'మెర్రీ క్రిస్మస్' అంటూ సందేశం పంపాడు. ఈ 14 అక్షరాల మెసేజ్‌ను ఆ సంస్థ.. డిసెంబర్ 21 వేలం వేస్తోంది. ఫ్రాన్స్‌‌కు చెందిన అగట్టెస్ ఆక్షన్ హౌస్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ వేలం జరగనుంది. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని శరణార్థులకు సహాయం చేయడానికి వినియోగించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

41 ఏళ్ల తర్వాత అత్యాచారం కేసులో ప్రారంభమయిన విచారణ.. ప్లీజ్.. ఆపేయండంటూ లేఖ రాసిన బాధితురాలు





Updated Date - 2021-12-18T03:29:15+05:30 IST