బెల్‌తరోడాలోని పీహెచ్‌సీ
తానూర్, జనవరి 26 : గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని కార్యా లయాల్లో జెండా ఎగురవేసిన, మండలంలోని బెల్‌తరోడా పీహెచ్‌సీలో జెండా ఎగురలేదు. ఇక్కడ ఎఎన్‌ఎమ్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకట రమణయ్య గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండాను ఎగురవేయలేదని గ్రామ సర్పంచ్ గోప సాయినాథ్ తెలిపారు. ప్రతీ సంవత్సరం సబ్‌సెంటర్‌లో జెండాను ఎగురవేయడం జరుగుతుందని, కాని ఈ గణతంత్ర దినోత్సవానికి మాత్రం జెండా ఎగురవేయలేదని, ఎఎన్‌ఎంపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.