కోరుట్లను కప్పేసిన పొగమంచు

ABN , First Publish Date - 2022-01-18T06:04:55+05:30 IST

కోరుట్ల పట్టణం సోమవారం పొగమంచుతో నిండి పోయింది. వేకవజామున పూర్తిగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. వారం రోజుల నుండి ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత పెరుగుతోంది.

కోరుట్లను కప్పేసిన పొగమంచు
పొగమంచుతో నిండిన కోరుట్ల

కోరుట్ల జనవరి 17: కోరుట్ల పట్టణం సోమవారం పొగమంచుతో నిండి పోయింది. వేకవజామున పూర్తిగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. వారం రోజుల నుండి ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం పూర్తిగా చల్లటి గాలులు వీయడంతో ప్రజలు ఇంటి నుండి బయటకు రావడానికి ఇబ్బం దులు పడ్డారు. ఉదయం 10 గంటల వరకు పొగమంచు ఉండడంతో వాహన దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  ఉదయం 9 గంటల వరకు కూరగా యల మార్కెట్‌లో అమ్మేవారు రాకపోవడంతో నిర్మానుష్యంగా కనిపించింది. 11 గంటల ప్రాంతంలో ఎండ రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చారు.

కోరుట్ల రూరల్‌ : మండలంలోని అయా గ్రామాలు సోమవారం పోగ మంచుతో నిడిపోయాయి. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు చలి తీవ్రతతో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. నాలుగు రోజుల నుండి వాతావరణంలో  తీవ్ర మార్పులు రావడంతో పాటు స్వల్ప వర్షం కురవడంతో చలి తీవ్రత పెరిగి సోమవారం పొగమంచుతో నిండి పోయింది. ఉదయం 10 గంటల వరకు గ్రామలు నిర్మాణుష్యంగా కనిపించాయి. 

Updated Date - 2022-01-18T06:04:55+05:30 IST