Advertisement
Advertisement
Abn logo
Advertisement

నా భర్త మృతికి అటవీ అధికారులే కారణం

ఇటీవల మృతి చెందిన తమిళ కూలి భార్య మంగమ్మ

ప్రొద్దుటూరు క్రైం, నవంబరు 30 : నా భర్త బాలకృష్ణన్‌ మృతికి అటవీ అధికారులే కారణమని తమిళనాడుకు చెందిన మంగమ్మ అరోపించారు. ఈనెల 26వ తేదీ తెల్లవారుజామున ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తుండగా అటవీ అధికారులు అడ్డుకున్నారు. అటవీ అధికారులపై స్మగ్లర్ల దాడి చేసిన నేపధ్యంలో ఓ తమిళ కూలి తాను ప్రయాణిస్తున్న మినీ లారీ (ఐచర్‌) కింద పడి మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న తమిళనాడు ధర్మపురి జిల్లా సిప్పేరి గ్రామానికి చెందిన బాలకృష్ణన్‌ భార్య మంగమ్మ సోమవారం ప్రొద్దుటూరు వచ్చి అటవీ, పోలీసు అధికారులను కలిసింది. ఈ సందర్భంగా మంగమ్మ మంగళవారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ నా భర్త మరణంపై చాలా అనుమానాలు ఉన్నాయని, దీనికి అటవీ అధికారులే బాధ్యత వహించాలన్నారు. ఇంటికి పెద్దదిక్కును కోల్పోయి రోడ్డున పడ్డామన్నారు. తన భర్తతో పాటు వచ్చిన మరో ముగ్గురు కన్పించడం లేదని, తమ గ్రామం వద్ద మరొకరి మృతదేహం లభించిందన్నారు. దీనిని బట్టి అటవీ అధికారులే తన భర్త మృతికి కారణం అని మంగమ్మ విలేఖరుల ఎదుట అవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement