జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయం

ABN , First Publish Date - 2022-01-28T04:34:35+05:30 IST

వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల ఏర్పాటు ప్రక్రియ అశాస్త్రీయంగా జరిగిందని ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి చెప్పారు.

జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయం
ఎమ్మెల్యే స్వామి

ఎమ్మెల్యే స్వామి

మర్రిపూడి, జనవరి 27 : వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల ఏర్పాటు ప్రక్రియ అశాస్త్రీయంగా జరిగిందని ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి చెప్పారు. గురువారం ఆంధ్రజ్యోతితో ఫోన్‌లో మాట్లాడారు. జిల్లాల ఏర్పాటులో సమతుల్యత లోపించిందని చెప్పారు. కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపడం సమంజసం కాదన్నారు. రామాయపట్నం ఓడరేవు నిర్మాణం ద్వారా వచ్చే ఫలాలు ప్రకాశం జిల్లా కోల్పోతుందని చెప్పారు. ముఖ్యంగా కొండపి నియోజకవర్గంలోని సింగరాయకొండ, జరుగుమల్లి మండలాలకు తీరని నష్టం జరుగుతుందన్నారు. కందుకూరు, కొండపి, ఒంగోలు, సంతనూతలపాడు, పర్చూరు, అద్దంకి, చీరాల నియోజకవర్గాలతో ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేయడంతోపాటు ఎలాంటి అభివృద్ధికి నోచుకోని పశ్చిమ ప్రాంత నియోజకవర్గాలైన గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, దర్శి, కనిగిరి నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లాగా చేసి ఉంటే బాగుండేదని చెప్పారు. కందుకూరు డివిజన్‌ లేకపోవడంతో నియోజకవర్గంలోని పొన్నలూరు, మర్రిపూడి మండలాల ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల సౌలభ్యాన్ని గుర్తించి జిల్లాల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. 

Updated Date - 2022-01-28T04:34:35+05:30 IST