Abn logo
Jan 21 2021 @ 00:35AM

వారు వేసిన పునాదుల బలమే!

తన గురువు జంధ్యాల, తల్లి విజయ నిర్మల వేసిన పునాదుల బలం వల్లే తాను మూడు దశాబ్దాల నుంచి సినీ రంగంలో కొనసాగుతున్నానని సీనియర్‌ నటుడు, మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నరేశ్‌ పేర్కొన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో సీనియర్‌ కళాకారులు, దర్శకులకు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, సీనియర్‌ నటులు ఆలీ, అశోక్‌కుమార్‌, పవిత్రా లోకేశ్‌, గౌతమ్‌ రాజు, కరాటే కళ్యాణిలను ఈ కార్యక్రమంలో సన్మానించారు. ‘‘నా గురువు జంధ్యాల గారు నాతో కొన్ని సినిమాలు తీశారు. మా అమ్మ విజయ నిర్మల గారు కొన్ని చిత్రాలు తీశారు. వారు వేసిన పునాదులపైనే మూడు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నా. ఒక విధంగా ఇది నా అదృష్టం. ప్రస్తుతం నేను నటించిన నాలుగు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరో ఏడు సినిమాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి. కథాబలం ఉన్న చిత్రాల్లో నటించడం వల్లే నటుడిగా సుదీర్ఘకాలం కొనసాగడం సాధ్యమయింది ’’ అని తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement