Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోజూ ఆటోలో ఇంటికి వెళ్లే క్రమంలో పళ్ల వ్యాపారితో ప్రేమలో పడ్డ 19 ఏళ్ల యువతి.. వీళ్ల లవ్ స్టోరీ చివరికి ఎలా ముగిసిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఆ యువతి రోజు షేర్ ఆటోలో ఇంటికి వెళ్లేది..ఓ రోజు అదే ఆటో ఎక్కిన ఓ యువకుడు ఆమెతో మాటలు కలిపాడు. ఈ పరిచయం కొన్నాళ్ల తరువాత స్నేహంగా మారింది. ఈ చనువు మరింత పెరిగి వారు ప్రేమలో పడిపోయారు. ఈ క్రమంలో ఆ యవకుడు..రాత్రిళ్లు ఎవరూ చూడకుండా ఆమె ఇంటికి వెళ్లివస్తుండే వాడు. ఇటీవల ఓ రోజు యువతి ఇంటికి వెళ్లి  ఆమె కుటుంబసభ్యులకు దొరికిపోయాడు. దీంతో.. వారు అతడిపై అత్యాచారం కేసు పెట్టారు. ఆ తరువాతే.. యువతి కల్పించుకోవడంతో వీరి ప్రేమ కథ మరో మలుపు తిరిగింది. పోలీస్ స్టేషన్‌లోనే వారు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ నగరానికి చెందిన ఓ యువతి సాకిబ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. పళ్ల స్టాండ్ నిర్వహించే అతడితో ఓ రోజు ఆటోలో ప్రయాణిస్తుండగా ఆమెకు పరిచయం అయింది. ఆ తరువాత అది ప్రేమగా మారింది. ఈ క్రమంలో రాత్రిళ్లు అప్పుడప్పుడూ సాకిబ్ యువతిని ఆమె ఇంట్లోనే కలుసుకుంటూ  ఉండేవాడు. ఈ విషయం ఆమె కుటుంబసభ్యులకు తెలియడంతో వారు సాకిబ్‌ను ప్రేమకలాపాలు మానుకోవాలంటూ పలుమార్లు హెచ్చరించారు. కానీ..అతడు మాత్రం తన ప్రేమబంధాన్ని తెంచుకోలేకపోయాడు. ఈ క్రమంలో అతడు సోమవారం రాత్రి తన ప్రేయసిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు దొరికిపోయాడు.

ఇవీ చదవండి: 
ఈ మహిళకు రూ. 1.8 కోట్ల పరిహారం.. ప్రతి మహిళా ఉద్యోగి తెలుసుకోవాల్సిన ఈమె కథేంటంటే..
ఇద్దరు పిల్లలతో సహా భార్య అదృశ్యం.. ఏడేళ్ల తర్వాత సిటీలో ఉంటున్న ఆమె గురించి షాకింగ్ నిజాలు..!

దీంతో..వారు సాకిబ్‌ను పోలీసులకు అప్ప జెప్పి అత్యాచారం కేసు పెట్టారు. అదే సమయంలో..సాకిబ్ కుటుంబసభ్యులు కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో యువతి మాత్రం సాకిబ్‌ అంటే తనకు ఇష్టం అని తేల్చి చెప్పింది. దీంతో.. పిల్లల భవిష్యత్తుగా దృష్ట్యా ఇరు కుటుంబాలు రాజీ పడేందుకు నిర్ణయించాయి. అయితే..యువతిని అప్పటికప్పుడు పెళ్లి చేసుకోవాలని ఆమె కుటుంబసభ్యులు షరతు విధించారు. దీంతో.. స్టేషన్‌లో వారి వివాహం జరిగిపోయింది. మౌల్వీని రప్పించిన పోలీసులు వారి వివాహాన్ని జరిపించారు. అయితే..అత్యాచారం కేసు నమోదవడంతో..అధికారికంగా ఆమె స్టేట్‌మెంట్ తీసుకోవాలని, ఆ తరువాత కోర్టు ఈ కేసును కొట్టేస్తుందని పోలీసులు తెలిపారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement