Abn logo
Sep 27 2021 @ 00:32AM

పూర్తిస్థాయిలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలి

సంఘీభావం ప్రకటిస్తున్న డీవైఎఫ్‌ఐ ప్రతినిధులు

డీవైఎఫ్‌ఐ డిమాండ్‌

గాజువాక, సెప్టెంబరు 26: రాష్ట్రంలో లక్షకు పైగా పోస్టులు ఖాళీగా ఉండగా కేవలం పది వేల పోస్టులకు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయడం అన్యాయమని, తక్షణమే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని డీవైఎఫ్‌ఐ నగర ప్రధాన కార్యదర్శి యూఎస్‌ఎన్‌ రాజు డిమాండ్‌ చేశారు. పెదగంట్యాడ సీడబ్ల్యూసీలో ఆదివారం డీవైఎఫ్‌ఐ 13వ మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జాబ్‌ లెస్‌ క్యాలెండర్‌ విడుదల చేసిందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నగర అధ్యక్షుడు కంబాల మహేశ్‌ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు నేటివరకు పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించలేదన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వై.అప్పలరాజు, వీరారెడ్డి, ప్రతాప్‌, రాజేష్‌, శివ పాల్గొన్నారు.