Advertisement
Advertisement
Abn logo
Advertisement

గుడిలోకి వెళ్లి ఈ యువతి చేసిన పనికి మండి పడుతున్న హిందుత్వ సంఘాలు.. ఈమె చేసిన నిర్వాకం ఏంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: గుడి పరిసరాల్లో ఓ యువతి చేసిన పని స్థానికంగా ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. ఆ యువతికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో హిందుత్వ సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే ఆ యువతిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఇంతకీ ఆ యువతి ఎవరు.. ఆమె గుడి పరిసరాల్లో ఏం చేసిందనే వివరాల్లోకి వెళితే..


 మధ్య ప్రదేశ్‌లోని ఛతర్పూర్ ప్రాంతానికి చెందిన ఆర్తి సాహుకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఒక్క యూట్యూబ్‌లోనే ఆమెకు 2.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వీడియోలతో తన ఫాలోవర్లను ఆమె ఉత్సాహపరుస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె స్థానికంగా ఉన్న గుడి వద్ద ఓ బాలీవుడ్ పాటకు చిందులేసింది. టెంపుల్ పరిసరాల్లో ‘సెకండ్ హ్యాండ్ జవానీ’ అనే సాంగ్‌కు డాన్యు చేసి, అందుకు సంబంధించి దృశ్యాలను యూట్యూబ్‌తోపాటు ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆమె డ్యాన్సుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో సదరు టెంపుల్‌కు సంబంధించన ప్రధాన పూజారి స్పందించారు. 


గుడి పరిసరాల్లో డ్యాన్స్ చేసి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆర్తి సాహుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే బజరంగ్ దళ్ సహా మరికొన్ని హిందుత్వ సంఘాలు ఆర్తి సాహు చేసిన పనిని ఖండిచాయి. అంతేకాకుండా ఆర్తి సాహు లాంటి వారి వల్లే సమాజం దరిద్రంగా తయారవుతోందని మండిపడ్డాయి. ఇటువంటి వైఖరి ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేశాయి. దీనితోపాటు ఆర్తి సాహుపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఆర్తి సాహు స్పందించింది. గుడి పరిసర ప్రాంతాల్లో తాను అసభ్యంగా ప్రవర్తించలేదని.. సంప్రదాయమైన దుస్తుల్లోనే డాన్సు చేశానని వెల్లడించారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన అంశం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశం అయింది. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement