ప్రియుడితో పెళ్లి కోసం యువతి హైడ్రామా.. ఇరువైపులా వాళ్లు అంగీకరించినా దిగి రాని వైనం.. ఇంతకీ ఆ యువతి డిమాండ్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-01-10T21:52:08+05:30 IST

ఆ యువతి కొద్ది రోజులుగా ఓ వ్యక్తితో ప్రేమలో ఉంది.. అతడినే పెళ్లి చేసుకోవాలనుకుంది..

ప్రియుడితో పెళ్లి కోసం యువతి హైడ్రామా.. ఇరువైపులా వాళ్లు అంగీకరించినా దిగి రాని వైనం.. ఇంతకీ ఆ యువతి డిమాండ్ ఏంటంటే..

ఆ యువతి కొద్ది రోజులుగా ఓ వ్యక్తితో ప్రేమలో ఉంది.. అతడినే పెళ్లి చేసుకోవాలనుకుంది.. అతడు కూడా ఆమెను వివాహం చేసుకునేందుకు సిద్ధంగానే ఉన్నాడు.. ఇద్దరూ తమ తమ కుటుంబాలను ఒప్పించారు.. అయినా ఆ యువతి ఆదివారం మధ్యాహ్నాం వాటర్ ట్యాంకర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగింది.. వెంటనే తమకు పెళ్లి చేయకపోతే చనిపోతానని బెదిరించింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆమెకు నచ్చ చెప్పారు. 


మధ్యప్రదేశ్‌లోని చింధ్వారాకు చెందిన పూజ అనే యువతి కొద్ది రోజులుగా గౌరవ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలనూ ఒప్పించారు. అయితే పూజ తల్లిదండ్రులు ఇప్పట్లో పెళ్లి చేయలేమని చెప్పారు. దీంతో ఆగ్రహించిన పూజ గ్రామంలోని వాటర్ ట్యాంకర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగింది. ఎంత మంది బతిమాలినా కిందకు దిగి రాలేదు. 


దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూజతో మాట్లాడారు. వెంటనే పెళ్లి చేస్తామంటేనే కిందకు దిగి వస్తానని పూజ చెప్పింది. పూజ తల్లిదండ్రులతో పోలీసులు మాట్లాడారు. వారికి నచ్చ చెప్పారు. ఈ నెలలోనే పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు అంగీకరించడంతో పూజ కిందకు దిగి వచ్చింది. 

Updated Date - 2022-01-10T21:52:08+05:30 IST