Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రేయసిని ఇంటికి తీసుకెళ్లి ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లిన ప్రియుడు.. తిరిగొచ్చేసరికి..

ప్రేమ పేరుతో మొదలయ్యే చాలా పరిచయాలు.. చివరికి విషాధాంతమవుతూ ఉంటాయి. ప్రేమించుకున్న సమయంలో చూపించే ప్రేమ.. తర్వాత కనపడదు. అక్కడే సమస్యలు మొదలవుతుంటాయి. కానీ కొన్ని ప్రేమ కథల్లో.. ప్రేమికుల మధ్య ఏ సమస్యలూ లేకున్నా.. ఇంట్లో వారితో సమస్యలు మొదలవుతాయి. చివరికి ఇబ్బందులు పడేది మాత్రం ప్రేమికులే. అందులోనూ యువతులకే నష్టం ఎక్కువగా జరుగుతుంటుంది. కర్ణాటకలో ఓ యువకుడు బాలికను ప్రేమించాడు. ఈ క్రమంలో ఓ రోజు ప్రియురాలిని తన ఇంటికి తీసుకెళ్లాడు. తర్వాత జరిగిన ఘటన.. ఆమె జీవితాన్ని అతలాకుతలం చేసింది..

ప్రతీకాత్మక చిత్రం

కర్ణాటక చిక్కమగళూరు బాళే హొన్నూరు పరిధిలో ఓ యువకుడు బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఓ రోజు తనను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. బాలిక కూడా అతడి ప్రేమను అంగీకరించడంతో రోజూ కలుసుకునేవారు. ఈ క్రమంలో ఓ రోజు ప్రియురాలిని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో ఉంచి తనకు బయట పని ఉందని చెప్పి వెళ్లాడు. ఆ సమయంలో బాలిక ఒక్కటే ఇంట్లో ఒంటరిగా ఉంది. అప్పుడే యువకుడి తండ్రి చంద్రు లోపలికి ప్రవేశించాడు. ఒంటిరిగా ఉన్న బాలికను చూసిన అతడికి వక్రబుద్ధి పుట్టింది. ఎలాగైనా అనుభవించాలని బలత్కారం చేశాడు. చంపేస్తానంటూ బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ప్రతీకాత్మక చిత్రం

అనంతరం బాలిక ఏడుస్తూ ఇంటికి వెళ్లి జరిగిన విషయం మొత్తం తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో బాలిక తల్లి.. బుధవారం బాలెహోమ్మూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement