Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైభవంగా గంగా సప్తహారతి

నేరేడుగొమ్ము, డిసెంబరు 2: కార్తీకమాసం త్రయోదశిని పురస్కరించుకొని మండల పరిధిలోని పెద్దమునిగల్‌ వద్ద కృష్ణానది తీరంలో గంగాసప్తహారతి మహోత్సవాన్ని గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. దేవరకొండ బ్రాహ్మణసంఘం, పెద్దమునిగల్‌ గ్రామకమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. తొలుత గ్రామదేవతలకు స్వాగతం, అభిషేకం నిర్వహించారు. అనంతరం గంగాకు సప్తదీపాలతో హారతి ఇచ్చి, సహస్రదీపాలంకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌, మాజీ ఎమ్మెల్యే బాలునాయక్‌, కేతావత్‌ లాలునాయక్‌, సర్పంచ్‌ కంబాల అంజయ్య, ఎంపీటీసీ యుగేందర్‌రెడ్డి, జీవన్‌ప్రసాద్‌, అంకులు, వంశీ, జడ్పీటీసీ బాలు, వైస్‌ ఎంపీపీ ఆరేకంటి ముత్యాలమ్మ రాములు, సర్పంచ్‌లఫోరం అధ్యక్షుడు లోకసాని తిరుపతయ్య, మార్కెట్‌ కమిటి చైర్మన్‌ శిరందాసు లక్ష్మయ్య, ఆలంపల్లి నర్సింహతోపాటు, బ్రాహ్మణసంఘం నాయకులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement