విద్యార్థి విజయమే లక్ష్యం

ABN , First Publish Date - 2021-10-24T05:14:57+05:30 IST

కళాశాలలో చదువుతున్న విద్యార్థుల విజయమే లక్ష్యమని, ఇదే కళాశాల విజయంగా భావిస్తున్నామని ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల (ఐతం) డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వీవీ నాగేశ్వరరావు అన్నారు. శనివారం కళాశాలలో 15వ ‘ఆదిత్య’ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు.

విద్యార్థి విజయమే లక్ష్యం
పూర్వ విద్యార్థులతో ఆదిత్య యాజమాన్య ప్రతినిధులు

‘ఐతం’ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ నాగేశ్వరరావు

కె.కొత్తూరు (టెక్కలి), అక్టోబరు 23: కళాశాలలో చదువుతున్న విద్యార్థుల విజయమే లక్ష్యమని, ఇదే కళాశాల విజయంగా భావిస్తున్నామని ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల (ఐతం) డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వీవీ నాగేశ్వరరావు అన్నారు. శనివారం కళాశాలలో 15వ ‘ఆదిత్య’ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి ఏ రంగంలో స్థిరపడినా ఆదిత్య విద్యార్థి అని గర్వంగా చెప్పుకునేలా  20 ఏళ్లుగా ప్రయాణం కొనసాగించామన్నారు. ఉత్తరాంధ్రలో పేరొందిన తొమ్మిది కళాశాలల్లో ఆదిత్య కళాశాల ఒకటిగా ఉండడం గర్వంగా ఉందన్నారు. నాక్‌-ఎ ప్లస్‌తో టైర్‌-1 కింద అన్ని బ్రాంచిలకు ఎన్‌బీఏ ఎక్రిడేషన్‌, అటానమస్‌ గుర్తింపు తీసుకు రాగలిగా మన్నారు. గత ఏడాది అన్ని బ్రాంచిల్లో సుమారు 800 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం ఆనందంగా ఉందన్నారు. 1980-81లో చదివిన పూర్వ విద్యార్థులంతా హాస్టల్‌లో వైద్యాలయాన్ని నిర్మించేం దుకు ముందుకు వచ్చారని, వారి పేరు మీదే భవనాన్ని నిర్మిస్తామని, ఇందుకు కళాశాల నుంచి 50 శాతం నిధులు భరిస్తామని చెప్పారు. సమావేశంలో కళాశాల కోశాధికారి టంకాల నాగరాజు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు, డీన్‌లు కేబీ మధుసాహు, డాక్టర్‌ విష్ణుమూర్తి, కన్వీనర్‌ యుగంధర్‌, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-10-24T05:14:57+05:30 IST