ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యం

ABN , First Publish Date - 2020-09-29T06:58:31+05:30 IST

ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించి వారికి ఉజ్వల భవిష్యత్తు కల్పించడమే అనురాగ్‌ యూనివర్సిటీ లక్ష్యమని అనురాగ్‌ యూనివర్సిటీ సీఈవో

ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యం

అనురాగ్‌ యూనివర్సిటీ సీఈవో నీలిమారెడ్డి 


ఘట్‌కేసర్‌ రూరల్‌: ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించి వారికి ఉజ్వల భవిష్యత్తు కల్పించడమే అనురాగ్‌ యూనివర్సిటీ లక్ష్యమని అనురాగ్‌ యూనివర్సిటీ సీఈవో నీలిమారెడ్డి అన్నారు. మండలంలోని వెంకటాపూర్‌ అనురాగ్‌ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో అనురాగ్‌సెట్‌లో టాప్‌టెన్‌లో నిలిచిన పదిమంది విద్యార్థులకు జ్ఙాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు  లక్ష్యాలను ఎంచుకుని వాటి సాధనకు కృషి చేయాలన్నారు. అనురాగ్‌సెట్‌లో మొదటి పది స్థానంలో నిలిచిన విద్యార్థులను సత్కరించి వారికి ఉపకారవేతనాలు అందిస్తున్నట్లు తెలిపారు. అనురాగ్‌ యూనివర్సిటీలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని, నిష్ణాతులైన అధ్యాపకులు ఉన్నారని గుర్తుచేశారు. కార్యక్రమంలో వైఎస్‌ చాన్స్‌లర్‌ రామచంద్రం, రిజిష్ట్రార్‌ సమీన్‌ ఫాతిమా, ప్రొఫెసర్‌ ముత్తారెడ్డి, అధ్యాపకులు ఎం.శ్రీనివాస్‌, తారాసింగ్‌నాయక్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-29T06:58:31+05:30 IST