ప్రజలకు సత్వరన్యాయం అందించడమే లక్ష్యం

ABN , First Publish Date - 2021-10-22T05:16:24+05:30 IST

ప్రజలకు సత్వరన్యాయం అందించడమే సేవాధికార సంస్థ లక్ష్యమని మెదక్‌ జిల్లా 8వ అదనపు న్యాయమూర్తి ఎంఆర్‌.సునీత పేర్కొన్నారు.

ప్రజలకు సత్వరన్యాయం అందించడమే లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న జహీరాబాద్‌ కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి దుర్గాప్రసాద్‌

మెదక్‌ జిల్లా 8వ అదనపు న్యాయమూర్తి ఎంఆర్‌.సునీత

మెదక్‌ అర్బన్‌/నారాయణఖేడ్‌/జహీరాబాద్‌, అక్టోబరు 21 : ప్రజలకు సత్వరన్యాయం అందించడమే సేవాధికార సంస్థ లక్ష్యమని మెదక్‌ జిల్లా 8వ అదనపు న్యాయమూర్తి ఎంఆర్‌.సునీత పేర్కొన్నారు. గురువారం న్యాయసేవా (లీగల్‌ సర్వీ్‌స)పై జిల్లాలోని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ న్యాయం దృష్టిలో అందరూ సమానమేనన్నారు. జిల్లాలోని 175 గ్రామాల్లో విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కలెక్టర్‌ హరీశ్‌ మాట్లాడుతూ బ్యానర్లను ఆయా గ్రామాల్లో ఏర్పాటుచేసి ఉచిత న్యాయ సేవలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి సంతో్‌షకుమార్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి రీతాలాల్‌చంద్‌, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. చట్టాలపై ప్రతిఒక్కరికీ అవగాహన అవసరమని ఖేడ్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు అన్నారు. గురువారం సిర్గాపూర్‌ మండల పరిధిలోని గైరాన్‌తండాలో చట్టాలపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది చంద్రశేఖర్‌, ఖేడ్‌ కోర్టు సూపరింటెండెంట్‌ జలీల్‌ అహ్మద్‌, ఖేడ్‌ న్యాయ సేవాధికారిత సంస్థ సిబ్బంది శ్రీనివాస్‌, సంజీవ్‌ పాల్గొన్నారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండడమే కాకుండా వరకట్నం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం కృషి చేయాలని జహీరాబాద్‌ కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి దుర్గాప్రసాద్‌ అన్నారు. గలీగల్‌ సర్వీసెస్‌ కమిటీ ఆధ్వర్యంలో జహీరాబాద్‌లోని జాగృతి డిగ్రీ కళాశాలలో న్యాయ సేవల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దత్తాత్రేయరెడ్డి, అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సలోమాన్‌, న్యాయవాదులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-22T05:16:24+05:30 IST