మూడు టీఎంసీల తరలింపే లక్ష్యం

ABN , First Publish Date - 2020-05-08T07:43:51+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి న కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వచ్చే వర్షాకాలంలో

మూడు టీఎంసీల తరలింపే లక్ష్యం

జూన్‌ నెలాఖరుకల్లా 2.5 టీఎంసీల నీళ్లు

ఆగస్టు 15 నుంచి ఏకకాలంలో 3 టీఎంసీల నీటి తరలింపు

పనుల్లో పరుగులు పెట్టించేందుకు చర్యలు

పంప్‌హౌస్‌లను సందర్శించిన మంత్రి ఈటల రాజేందర్‌


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి న కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వచ్చే వర్షాకాలంలో మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని ప్రభు త్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రస్తుతానికి రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోస్తుండగా, అదనంగా మరో టీఎంసీ నీటిని కూడా ఎత్తిపోసేందు కు పనులు నడుస్తున్నాయి. కాంట్రాక్టు సంస్థలకు ఇచ్చిన గడువు ప్రకా రం జూన్‌ నెలాఖరు వరకు పూర్తికావాల్సి ఉండగా, కరోనా వైరస్‌ వ్యా ప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ వల్ల పనులు నిలిచిపోయాయి. వివిధ రాష్ట్రా ల నుంచి ఇక్కడ పనులు చేసేందుకు వచ్చిన వలస కూలీల్లో కొందరు వెళ్లిపోగా, రావాల్సిన పంపు మోటార్లు షిప్పుల్లో ఉండగా, విదేశాల నుంచి మరికొన్ని పరికరాలు రావాల్సి ఉన్నాయి. ఈ కారణాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతున్నది.


క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకుని చర్యలు చేపట్టేందుకు వీలుగా సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సభర్వాల్‌, రాష్ట్ర నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌, తదితరులు గురువారం పంప్‌ హౌస్‌లను పరిశీలించారు. సం బంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పనులు ఎప్పటి వరకు పూర్తి అవుతాయి,  మోటార్లను తీసుకరావడం ఎలా, తదితర అంశాలపై చర్చించారు. గత ఏడాది వర్షాకాలం నాటికే కాళేశ్వరం ప్రా జెక్టు నీటిని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోయాలని నిర్ణయిం చిన ప్రభుత్వం పనులను వేగంగా చేయించింది.


గడిచిన సీజన్‌లో సుమారు 52 టీఎంసీల నీటిని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలించారు. శ్రీపాద నుంచి మిడ్‌ మానేరు వరకు 2 టీఎంసీల నీటిని మాత్రమే తరలించే వెసులుబాటు ఉన్నది. మరో టీఎంసీ నీటిని తరలించేందుకు కొత్తగా ప్రతిపాదనలు సిద్ధం చేసి పనుల కోసం ప్రభుత్వం టెండర్లు చేపట్టిన విషయం తెలిసిందే. కొత్తగా చేపట్టే పనులు రెండేళ్లలో పూర్తిచేసేందుకు నీటి పారుదల శాఖాధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 


కాళేశ్వరం మొదటి దశలో మూడు బ్యారేజీలు, మూడు పంప్‌ హౌస్‌లు పూర్తి కాగా, రెండవ దశ పనులు కూడా పూర్తి కావస్తున్నా యి. గత నెలలో మిడ్‌ మానేరు నుంచి రంగనాయక సాగర్‌కు అక్కడి నుంచి మల్లన్ల సాగర్‌కు నీటిని తరలించేందుకు ట్రయల్‌ రన్‌ను కూడా పూర్తిచేశారు. వచ్చే వర్షాకాలంలో కురిసే నీటిని వృథాగా పోని వ్వకుండా వెంట వెంటనే నీటిని తరలించేందుకు మూడవ టీఎంసీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ ఏడాది వర్షాలు ముందస్తుగానే కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖాధికారులు చెబుతుండడంతో పనులు త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ప్రాణహిత ఎగువ భాగాన కురిసే వర్షాల వల్ల మేడిగడ్డకు వచ్చే వరద నీటిని వెంట వెంటనే శ్రీపాద ఎల్లంపల్లికి తరలించాలని భావిస్తున్నారు. అక్కడి నుంచి డైరెక్టుగా మల్లన్న సాగర్‌కు లిఫ్ట్‌ చేసి ఆగష్టు కల్లా దాని పూర్తిస్థాయిలో నింపాలని ప్రభుత్వం భావిస్తున్నది. దాంతో పాటు రంగనాయక సాగర్‌, అనంత సాగర్‌ను నింపిన తర్వాత మిడ్‌ మానేరు, లోయర్‌ మానేర్‌ డ్యామ్‌ నింపి పరిస్థితిని బట్టి వరద కాలువ గుండా ఎస్సారెస్పీకి నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించారు.


లక్ష్మీ(కన్నేపల్లి) పంప్‌ హౌస్‌లో ఏర్పాటు చేయాల్సిన ఆరు మోటార్లకు 2 మోటార్లు వచ్చాయి. మూడు మోటార్లు లాక్‌డౌన్‌ వల్ల షిప్పుల్లో ఉన్నాయి. మరొక మోటార్‌ విదేశాల నుంచి రావాల్సి ఉంది. పార్వతి(సుందిళ్ల) పంప్‌హౌస్‌లో 4 మోటార్ల పనులు, పైప్‌లైన్‌ నిర్మాణ పనులు నడుస్తు న్నాయి. మోటార్లకు సంబంధించిన కొన్ని పరికరాలు రావాల్సి ఉన్నా యి. సరస్వతీ(గోలివాడ) పంప్‌ హౌస్‌లో 5 మోటార్లకు 3 మోటార్లు వచ్చాయి. ఇంకా 2 మోటార్లు రావాల్సి ఉన్నాయి.


మోటార్ల బిగింపు పనులు నడుస్తున్నాయి. జూన్‌ నెలాఖరుకల్లా 2.5 టీఎంసీల నీటిని, ఆగస్టు 15 వరకు 3 టీఎంసీల నీటిని తరలించేందుకు వీలుగా పను లు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా ఈ సీజన్‌ లోనే మూడు టీఎంసీల నీటిని తరలించాలనే లక్ష్యం పెట్టుకున్న ప్రభుత్వం పనుల్లో పరుగులు పెట్టించేందుకు చర్యలు చేపట్టింది. 

Updated Date - 2020-05-08T07:43:51+05:30 IST