ఉద్యోగుల ప్రాణాలు కాపాడడమే సంస్థ లక్ష్యం

ABN , First Publish Date - 2021-10-24T06:26:20+05:30 IST

సింగరేణి ఉద్యోగుల ప్రాణాలు కాపాడడ మే సంస్థ లక్ష్యమని సింగరేణి డైరెక్టర్లు చంద్రశేఖర్‌, బలరాంనాయక్‌, సత్యనారాయణరావు అన్నారు.

ఉద్యోగుల ప్రాణాలు కాపాడడమే సంస్థ లక్ష్యం
ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న డైరెక్టర్లు

- కరోనా కట్టడికి సంస్థ చర్యలు 

- ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ప్రారంభించిన డైరెక్టర్లు

గోదావరిఖని, అక్టోబరు 23: సింగరేణి ఉద్యోగుల ప్రాణాలు కాపాడడ మే సంస్థ లక్ష్యమని సింగరేణి డైరెక్టర్లు చంద్రశేఖర్‌, బలరాంనాయక్‌, సత్యనారాయణరావు అన్నారు. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో రూ.1కోటి వ్యయంతో నిర్మించిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను డైరెక్టర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా రెండవ దశలో చాలా మంది ఉద్యోగులను సంస్థ కోల్పోయిందని, ప్రాణవాయువు కొరతతో పాటు కరోనా తీవ్రతతో ఉద్యోగులు మృతి చెందడం బాధకరమన్నారు. సంస్థ సీఎం డీ శ్రీధర్‌ కరోనా కట్టడికి సింగరేణి వ్యాప్తంగా ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మాణా లు చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడంతో రామగుండం, రామకృష్ణ, మణుగూరు, కొత్తగూడెం ఏరియాలో ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రామగుండంలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌ ద్వారా గంటకు 45 క్యూబిక్‌ మీటర్ల ఆక్సిజన్‌ సరఫరా చేయడం జరుగుతుందని, 3వ దశ కరోనాను కట్టడి చేయడానికి ఈ ప్లాంట్ల నిర్మాణం చేయడం జరిగిందని, ప్రాణవాయువు కొరత చాలా వరకు తీరుతుందన్నారు. సంస్థ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని, వైద్య, పారిశుధ్యంతో పాటు విద్యకు పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు. ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్‌ అధ్యక్షులు బీ వెంకట్రావ్‌, డీవైసీఎంఓ కిరణ్‌ రాజ్‌, అధికారుల సంఘం నాయకులు పొనగో టి శ్రీనివాస్‌, నాయకులు కెంగర్ల మల్లయ్య, అధికారులు త్యాగరాజు, రాం మూర్తి, నవీన్‌, మదన్‌మోహన్‌, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-24T06:26:20+05:30 IST