రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2020-05-27T10:14:02+05:30 IST

రైతు శ్రేయస్సే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్మమని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌, ఎంపీ నామా

కొత్తగూడెంలో నియంత్రిత సాగుపై అవగాహన సదస్సు 

 

ఆంధ్రజ్యోతి కొత్తగూడెం, మే 26: రైతు శ్రేయస్సే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్మమని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. కొత్తగూడెం క్లబ్‌లో మంగళవారం జరిగిన వానాకాల నియంత్రిత పంటలసాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి అజయ్‌ మాట్లాడుతూ రైతులంతా ఒకే రకమైన పంటవేసి నష్టపోకుండా డిమాండ్‌కు తగినట్లు పంటలు వేసేలా రైతులకు అవగాహన కలిగించాలని, నేల స్వాభావం, మర్కెట్లో డిమాండ్‌ను బట్టి పంటలు పండించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సన్నరకం వరిసాగుకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని కంది, పత్తి పంటల విస్తీర్ణం పెంచినప్పుడే  రైతుకు లాభం చేకురుతుందన్నారు. పట్టణాలకు సమీపంలోని వ్యవసాయభూముల్లో కూరగాయల సాగును  చేయాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన పంటలకనుగుణంగా విత్తనాలను అందుబాటులో ఉంచాలని అఽధికారులకు సూచించారు. గ్రామాల్లో నకిలీ, కల్తీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు అదేశించారు. 


ఇజ్రాయోల్‌ స్ఫూర్తితో నడుదాం: ఎంపీ నామా 

తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు జరుగుతున్నాయని, ఇజ్రాయోల్‌ స్ఫూర్తితో ముందడుగు వేద్దామని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. నియంత్రిత సాగు విధానంలో భద్రాద్రి జిల్లాను తొలి స్థానంలో ఉంచేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో రైతులను చైతన్యపర్చి కమర్షియల్‌ పంటలపై దృష్టి సారించాలని, ఐదేళ్ల ప్రణాళికతో ముందడుగు వేయాలని, ఫుడ్‌ప్రాసెసింగ్‌ పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి కేంద్రికరించాలని సూచించారు. అప్పుడే క్షేత్రస్థాయిలో యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని వివరించారు. సదస్సులో భద్రాద్రి జిలా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారయణ, కొత్తగూడెం, ఇల్లెందు, వైరా ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ, రాములునాయక్‌, జడ్పీచైర్మన్‌ కోరం కనకయ్య, అదనపు కలెక్టర్‌ కె.వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయాధికారి అభిమన్యుడు, డీఆర్‌వో ఆశోకచక్రవర్తి, రైతుబంధు జిల్లా కన్వీనర్‌ కృష్ణారెడ్డి, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-27T10:14:02+05:30 IST