ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

ABN , First Publish Date - 2021-04-19T06:02:33+05:30 IST

రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్‌ ఎస్‌ఎ. రజాక్‌, జెడ్పీటీసీ కన్న సురాంబవీరన్న అన్నా రు.

ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది
కొత్తపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న రజాక్‌

మద్దిరాల/ అర్వపల్లి ఏప్రిల్‌ 18: రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్‌ ఎస్‌ఎ. రజాక్‌, జెడ్పీటీసీ కన్న సురాంబవీరన్న అన్నా రు. మద్దిరాల మండలంలోని జి.కొత్తపల్లి, మామిండ్లమడవ, రామచం ద్రాపురం, కుక్కడం, గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాలను ఆదివారం ప్రారంభించారు. నాణ్యమైన ధాన్యం తెచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ శ్రీరాంరెడ్డి, కోడి శ్రీనివాస్‌ యాదవ్‌, గుడ్ల వెంకన్న, మల్లు కపోతంరెడ్డి, చంద్రమౌలి, సర్పంచ్‌లు నర్సమ్మ, కోమలి, వెంకన్న, కొమరయ్య, ఎంపీటీసీలు పద్మ, శ్రీలత, ఉప్పలయ్య ఉన్నారు. అర్వపల్లి మండలం అడివెంల, వేల్పుచర్ల, జాజిరెడ్డిగూడెం, లోయపెల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ మన్నె రేణుకలక్ష్మినర్సయ్యయాదవ్‌, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌ ప్రారంభించారు. శ్రీరాంసాగర్‌ నీటితో ఎన్నడూ లేని విధంగా రైతులు వరిపంటలు వేసి అధిక దిగుబడులు సాధించారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు గాదరి శాంతమ్మ, పెరుమాళ్ళ పద్మ, కర్ణాకర్‌, ఎంపీటీసీ నర్సింగ్‌ నాగమ్మ, మొరిశెట్టి ఉపేందర్‌. సోమిరెడ్డి, విజయ్‌, గంగయ్య, పద్మ, యాదయ్య, సోమయ్య ఉన్నారు.  

Updated Date - 2021-04-19T06:02:33+05:30 IST