‘కరోనా కట్టడిలో ప్రభుత్వాలు విఫలం’

ABN , First Publish Date - 2020-08-12T10:41:08+05:30 IST

కరోనా నిర్మూలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్‌ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే

‘కరోనా కట్టడిలో ప్రభుత్వాలు విఫలం’

మంగపేట, ఆగష్టు 11: కరోనా నిర్మూలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్‌ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. కమలాపురంలో గుండెపోటుతో మృతిచెందిన కాంగ్రెస్‌ వాది తలారి పూర్ణచందర్‌రావు మృతదేహాన్ని ఆమె మంగళవారం సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ కరోనాను కట్టడి చేయడానికి సరిపడా వనరులను ప్రభుత్వాలు సమకూర్చడం లేదని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో  చింతా పరమాత్మ, గుమ్మడి సోమయ్య,  ఎస్‌. జగదీశ్వర్‌రావు, సి.హెచ్‌. పున్నారావు, వేమ రవి, గౌతంకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


 గోవిందరావుపేట : మండలంలోని పస్రాకు చెందిన కాంగ్రెస్‌ గ్రామ కమిటీ అధ్యక్షుడు మద్దినేని శ్రీనివాస్‌ ఇటీవల అనారోగ్యంతో మరణించగా ఆయన కుటుంబ సభ్యులను  ఎమ్మెల్యే సీతక్క  మంగళవారం పరామర్శించారు.  శ్రీనివాస్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆమె వెంట పార్టీ మండల అధ్యక్షుడు పన్నాల ఎల్లారెడ్డి, ఎస్సీ సల్‌ జిల్లా అధ్యక్షుడు దాసరి సుధాకర్‌, పస్రా సర్పంచ్‌ ముద్దబోయిన రాము, ఉపసర్పంచ్‌ బద్దం లింగారెడ్డి తదితరులు ఉన్నారు.  అనంతరం కాంగ్రెస్‌  మండల అధ్యక్షుడు పన్నాల ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ మండల యువజన నాయకుడు కడియాల నరేంద్రబాబు  ఎమ్మెల్యే  సీతక్క సమక్షంలో పార్టీలో చేరారు. 

Updated Date - 2020-08-12T10:41:08+05:30 IST