కనీస మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2021-12-07T05:29:36+05:30 IST

రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్‌ డి.సుధా పేర్కొన్నారు.

కనీస మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
సజ్జల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్సీ

గోపవరం, డిసెంబరు 6: రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్‌ డి.సుధా పేర్కొన్నారు. సోమవారం మండలంలోని బేతాయిపల్లెలో సజ్జల కొనుగోలు కేంద్రా న్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌లో సాగు చేసిన సజ్జ పంటకు ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించేందుకే రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. రైతులు దళారుల దగ్గర మోసపోకుండా ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2250 కనీస మద్దతు ధర కల్పించి మార్కెఫెడ్‌ ద్వారా కొనుగోలు చేస్తోందన్నారు.  కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి అరవింద్‌నాయక్‌, బద్వేలు మున్సిపల్‌ చైర్మన్‌ రాజగోపాల్‌రెడ్డి, మార్కెట్‌యార్డ్‌ వైస్‌ చైర్మన్‌ రమణారెడ్డి, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-07T05:29:36+05:30 IST