నిరుపేదలకు గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2022-01-21T06:18:48+05:30 IST

గూడు లేని నిరుపేదలందరికీ గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ముస్తాబాద్‌ మండల పరిషత్‌ అధ్యక్షులు జనగామ శరత్‌రావు పేర్కొన్నారు.

నిరుపేదలకు గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
డ్రా తీస్తున్న లబ్ధిదారులతో ఎంపీపీ శరత్‌రావు తదితరులు

- ఎంపీపీ జనగామ శరత్‌రావు

ముస్తాబాద్‌, జనవరి 22 : గూడు లేని నిరుపేదలందరికీ గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ముస్తాబాద్‌ మండల పరిషత్‌ అధ్యక్షులు జనగామ శరత్‌రావు పేర్కొన్నారు.  ముస్తాబాద్‌ మండల కేంద్రంలోని ఏఎంఆర్‌ గార్డెన్‌లో గురువారం తహసీల్దార్‌ జ్యోతి వరలక్ష్మీ దేవి ఆధ్వర్యంలో డబల్‌ బెడ్‌ రూం ఎంపిక లబ్ధిదారులకు బ్లాక్‌లలో ఇళ్ల నెంబరు ఎంపిక కోసం డ్రా తీశారు. ఈసందర్భంగా ఎంపీపీ జనగామ శరత్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో ముస్తాబాద్‌లో 156 ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. దాదాపు రూ 8 కోట్లు వెచ్చించి డీబీఎస్‌ ఇళ్లను నిర్మించగా వాటిని అర్హులైన లబ్దిదారులకు అందించడం కోసం ఎలాంటి సిఫరసులు లేకుండా అధికారులు కసరత్తు చేశారన్నారు. ఒక్క రుపాయి ఖర్చు చేయకుండా ఇల్లు కట్టించి  అందించడం తెలంగాణాలో కేసీఆర్‌  గొప్ప అధ్యయానికి శ్రీకారం చుట్టారన్నారు. నిరుపేద కుటంబంలో ఆనంద క్షణాలని మరిచిపోలేని తీపి జ్ఞాపకాలన్నారు. లేనోళ్లను అభివృద్ది పరచడమే సంకల్పంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మొదటగా డ్రాలో వికలాంగులకు డ్రా తీసి మిగితావి డ్రా ప్రక్రియ ద్వారా ప్లాట్ల ప్రక్రియ పూర్తి చేశారన్నారు. అర్హులై ఉండి రాని వాళ్లు ఎవరూ బాధపడొద్దని మరో 70 ఇళ్ల వరకు ముస్తాబాద్‌కు ఇవ్వడానికి మంత్రి కేటీఆర్‌ సుముఖంగా ఉన్నారన్నారు. మొదటి దశ పూర్తి చేసి వాటిని మంత్రి సహకారంతో తీసుకువస్తామన్నారు. అర్హులైన వారు కొద్ది మంది రాకపోవడంతో వారి మిగిలిన చిట్టీలను శుక్రవారం డ్రా తీయనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్‌ జ్యోతి వరలక్ష్మీ దేవి, జడ్పీటీసీ గుండం నర్సయ్య, మండల రైతు బఽంఽధు అధ్యక్షుడు గోపాల్‌రావు, సర్పంచ్‌ సుమతి, ఉపసర్పంచ్‌ రవీందర్‌గౌడ్‌, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్‌, కంచం మంజుల, వార్డు సభ్యులు గుండవేని సతీశ్‌, పల్లె సత్యం, సార్గు వెంకటేశ్‌లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T06:18:48+05:30 IST