కరోనా బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2021-06-17T05:14:12+05:30 IST

కరోనా బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాజంపేట తహసీల్దారు కార్యాలయం ఎదుట బుధవారం టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు.

కరోనా బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
నందలూరులో తహసీల్దారుకు వినతిపత్రం అందజేస్తున్న బత్యాల చెంగల్‌రాయులు

పలు చోట్ల టీడీపీ నేతల నిరసన ఫ అధికారులకు వినతి పత్రాల అందజేత

రాజంపేట, జూన్‌16 : కరోనా బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాజంపేట తహసీల్దారు కార్యాలయం ఎదుట బుధవారం టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట ఇన్‌చార్జి బత్యాల చెంగల్‌రాయులు నేతృత్వంలో తహసీల్దారు రవిశంకర్‌రెడ్డికి కరోనా బాధితులను ఆదుకోవాలంటూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బత్యాల మాట్లాడుతూ కరోనాను అరికట్టడంలో, కరోనా బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. అనేక మంది అమాయకులు ప్రాణాలు వదిలారన్నారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం   కరోనా బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు మహిళాధ్యక్షురాలు అనసూయమ్మ, టీడీపీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి చెన్నూరు సుధాకర్‌, పట్టణ, రూరల్‌ అధ్యక్షులు సంజీవరావు, సుబ్రహ్మణ్యంనాయుడు, మండల పార్టీ  మాజీ అధ్యక్షుడు బాసినేని వెంకటేశ్వర్లనాయుడు, కోనంకి కృష్ణమూర్తి, మాజీ కౌన్సిలర్‌ గుగ్గిళ్ల చంద్రమౌళి, మనుబోలు వెంకటేశ్వర్లు, క్షత్రియ సంఘం నాయకుడు ప్రతా్‌పరాజు, బీసీ నాయకుడు ఇడిమడకల కు మార్‌, అబుబకర్‌, ఎస్సీ సెల్‌ నాయకులు మందా శ్రీనివాసులు, కొండా శ్రీనివాసులు, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ నాయకులు పోలి శివకుమార్‌, రమణరాజు, వెంకటసుబ్బయ్యయాదవ్‌, పసుపులేటి ప్రవీణ్‌, రేవూరి వేణుగోపాల్‌, జ్యోతి శివకుమార్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు. 

రాజంపేట మున్సిపల్‌ కార్యాలయం ఎదుట టీడీపీ నిరసన :

ఇంటి పన్నులు, కుళాయి పన్నుల పెంపునకు నిరసనగా రాజంపేట మున్సిపల్‌ కార్యాలయం ఎదుట టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్‌రాయులు ఆధ్వర్యంలో బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ప్రజలకు ఎంతో ఇబ్బందికరంగా ఉన్న పన్నులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. 


ఈ ప్రభుత్వం మాకు వద్దు మహాప్రభో.... కస్తూరి 

రైల్వేకోడూరు రూరల్‌, జూన్‌ 16: ఈ ప్రభుత్వం మాకు వద్దు  మహా ప్రభో అని రాష్ట్ర ప్రజలు అనే రోజులు దగ్గర పడ్డాయని రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జ్‌ కస్తూరి విశ్వనాఽథనాయుడు తెలిపారు. బుధవారం పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా బాధితులను ఆదుకోవడంలో విఫలమైందని నిరసిస్తూ తహసీల్దార్‌ శిరీషాకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓబులవారిపల్లి మండల మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు, రైల్వేకోడూరు టీడీపీ మండల అధ్యక్షుడు కొమ్మ శివ, సీనియర్‌ నాయకులు దుగ్గిరాల జయచంద్ర, మైనారిటీ నాయకులు బాష, కరీముల్ల  పాల్గొన్నారు.

నందలూరు..:   కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్‌రాయులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం నందలూరు తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. అనంతరం తహసీల్దారు శ్రీరాములునాయక్‌ కు వినతిపత్రం అందజేశారు.  ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షురాలు అనసూయదేవి, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ పార్లమెంటు అధ్యక్షుడు రేవూరి వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-17T05:14:12+05:30 IST