Advertisement
Advertisement
Abn logo
Advertisement

బీటీపీ అభివృద్ధిని విస్మరించిన ప్రభుత్వంగుమ్మఘట్ట, నవంబరు 30: బీటీపీ రిజర్వాయర్‌ అభివృద్ధిని ప్రభుత్వం విస్మరించిందని గుమ్మఘట్ట మండల టీడీపీ నాయకులు విమర్శించారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రెండేళ్లుగా ప్రాజెక్టు స్థితిగతులపై అధికార ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. టీడీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు చొరవ తీసుకుని రూ. 689 కోట్ల నిధులు మంజూరు చేయించి ప్రాజెక్టు అభివృద్ధికి కృషి చేస్తే ప్రస్తుత పాలకులు స్పందించిన దాఖలాలు లేవన్నారు. బీటీపీ ప్రాజెక్టుకు సంబంధించి కొత్త గేట్లను ఏర్పాటు చేయడం, అతిథి గృహం ప్రాంగణంలో మొక్కలు పెంచడం తదితర అభివృద్ధిని చేపట్టిన ఘనత టీడీపీదేనన్నారు. రాయదుర్గానికి వచ్చిన సీఎం జగన మూడు నెలల్లో బీటీపీ ప్రాజెక్టు భూసేకరణ పనులను పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదన్నారు. ఇప్పటికైనా ప్రాజెక్టు స్థితిగతులపై, అభివృద్ధిపై ప్రభుత్వం చొరవ చూపాలని హితవు పలికారు. సమావేశంలో మాజీ ఎంపీపీ పాలయ్య, టీడీపీ యూత సీనియర్‌ నాయకులు కాలవ సన్నణ్ణ, నాగరాజు, మాజీ సర్పంచ గంగాధర, మోహన రంగ, రంగస్వామి, మాజీ బీటీపీ ప్రాజెక్టు చైర్మన కాలవ నాగరాజు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement