ఆదివాసీలను మభ్యపెడుతున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-01-22T06:19:05+05:30 IST

అటవీ హక్కుల చట్టం గురించి తెలియకుండా అ మాయక ఆదివాసీలకుు పోడు పట్టాలు ఇస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం మభ్యపెడుతోందని, గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్‌ ఏమీ తెలియకుండానే కేంద్రంపై, బీజేపీ నాయకత్వంపై నోరు పారేసుకుంటున్నారని ఎంపీ సోయం బాపురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పట్టణంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ

ఆదివాసీలను మభ్యపెడుతున్న ప్రభుత్వం
మాట్లాడుతున్న ఎంపీ సోయం బాపురావు

మంత్రి సత్యవతిపై నిప్పులు చెరిగిన సోయం 

ఉట్నూర్‌, జనవరి 21: అటవీ హక్కుల చట్టం గురించి తెలియకుండా అ మాయక ఆదివాసీలకుు పోడు పట్టాలు ఇస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం మభ్యపెడుతోందని, గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్‌ ఏమీ తెలియకుండానే కేంద్రంపై, బీజేపీ నాయకత్వంపై నోరు పారేసుకుంటున్నారని ఎంపీ సోయం బాపురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పట్టణంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్‌ సీఎం కేసీఆర్‌ మెప్పు కోసం తమ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై, కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్‌ ఎంత వరకు చదువుకున్నారో? తమకు తెలుసని, కేవలం నాల్గో తరగతి చదివి ఎమ్మెల్సీ ద్వారా మంత్రి అయిన ఆమె పోడు చట్టాల గురించి  తెలుసుకోవడానికి టూషన్‌కు వెళ్లాలని ఎద్దేవా చేశారు. ఆరేళ్లుగా పట్టాలు ఇస్తామంటూ ఆదివాసీలను ప్రభుత్వం కమిటీ పేరుతో మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. బండిసంజయ్‌ని చూసి గులాబీ నాయకులు భయపడుతున్నారని, పద్ధతి లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. 

మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించేలా కృషి

తెలంగాణలోని ఆదివాసీల అతిపెద్ద జాతర అయిన మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించేలా కృషి చేస్తున్నామని, ఫిబ్రవరిలో జరగనున్న సమ్మక్క, సారలమ్మ జాతరకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తున్నామని ఎంపీ సోయం బాపురావు తెలిపారు. రాష్ట్ర ప్రతినిధుల ఆధ్వర్యంలో త్వరలో ప్రధానిని కలస్తామని తెలిపారు. ఈ సమావేశంలో హరినాయక్‌, నందిరెడ్డి, రాజశేఖర్‌, కడమండ్ల రాజమణీ, మెస్రం బాగ్యలక్ష్మిలు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-22T06:19:05+05:30 IST