సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రభుత్వం పెద్దపీట

ABN , First Publish Date - 2022-01-29T04:20:49+05:30 IST

ఆదివాసుల సంస్కృతి, సంప్రదా యాలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. శుక్రవారం మండలంలోని దంతన్‌పల్లి భీమ య్యక్‌ దేవుని మహాజాతర కార్య క్రమానికి కుటుంబసభ్యులతో కలిసి హాజరై మొక్కులు చెల్లిం చారు.

సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రభుత్వం పెద్దపీట
పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆత్రం సక్కు

- ఎమ్మెల్యే ఆత్రం సక్కు

తిర్యాణి, జనవరి 28: ఆదివాసుల సంస్కృతి, సంప్రదా యాలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. శుక్రవారం మండలంలోని దంతన్‌పల్లి భీమ య్యక్‌ దేవుని మహాజాతర కార్య క్రమానికి కుటుంబసభ్యులతో కలిసి హాజరై మొక్కులు చెల్లిం చారు. అనంతరం ఐటీడీ నిధులు రూ.12లక్షలతో మంజూరైన కమిటీ హాల్‌ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి నిర్వాసిత ప్రాంత మైన దంతన్‌పల్లిలో వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులను స్థానిక జీఎంతో మాట్లాడి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నాగోబాయి, వైస్‌ ఎంపీపీ పార్వతి, జడ్పీటీసీ దృపతాబాయి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-29T04:20:49+05:30 IST