విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

ABN , First Publish Date - 2021-08-17T17:32:55+05:30 IST

నాడు- నేడు పథకం ద్వారా..

విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

విద్యా కానుక కిట్లు పంపిణీలో వక్తలు


ఎలమంచిలి: నాడు- నేడు పథకం ద్వారా విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని డీసీసీబీ మాజీ చైర్మన్‌ యు.సుకుమారవర్మ అన్నారు. ఇక్కడి కొత్తపేట ఉన్నత పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను సోమవారం ప్రారంభించి మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు విద్యా కానుక కిట్లు పంపిణీ చేశారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ రమాకుమారి, కమిషనర్‌ కృష్ణవేణి,  వైస్‌ చైర్మన్లు బెజవాడ నాగేశ్వరరావు, అర్రెపు గుప్తా, ంపీడీవో సత్యనారాయణ, పంచాయితీ రాజ్‌ డీఈ గుణశేఖర్‌, హెచ్‌ఎం అప్పారావు, పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ తంగేటి నర్సింగరావు వైసీపీ పట్టణ అధ్యక్షుడు బొద్దపు యర్రయ్యదొర, నాయకులు ఆడారి16ఆర్‌బిఎల్‌:1,2. 1. పంచదార్ల హైస్కూల్లో విద్యార్ధులకు జగనన్న విద్యాకానుక కిట్లును అందజేస్తున్న డీసీసీబీ మాజీ చైర్మన్‌ సుకుమార్‌వర్మ.


రాంబిల్లి: విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని డీసీసీబీ మాజీ చైర్మన్‌ యు.సుకుమారవర్మ అన్నారు. సోమవారం పంచదార్ల హైస్కూల్‌లో జగనన్న విద్యాకానుక కిట్లను సోమవారం పంపిణీ చేసి మాట్లాడారు.  రాంబిల్లి హైస్కూల్‌లో వైసీపీ మండల కన్వీనర్‌ జి.శ్రీనుబాబు, ధూళి నాగరాజు విద్యార్థులకు కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సర్పంచులతో పాటు ఉపాధ్యాయులు నాయ కులు పాల్గొన్నారు. 


మునగపాక : నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలలు, వైద్యాలయాలు అభివృద్ధి చేయడం జరుగుతుందని డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఉప్పలపాటి సుకుమారవర్మ అన్నారు. మునగపాక నంబరు-1 పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను సోమవారం ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉదయశ్రీ, ఎంఈవో దేవరాయులు, హెచ్‌ఎం సావిత్రి, స్కూల్‌ కమిటీ చైర్మన్లు శైలజా, ఆడారి గణపతి అచ్చియ్యనాయుడు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు కొణతాల రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-17T17:32:55+05:30 IST