పంజాగుట్టలో అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం అడ్డంకులు

ABN , First Publish Date - 2021-06-23T10:12:30+05:30 IST

హైదరాబాద్‌లోని పంజాగుట్ట కూడలిలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వడం లేదని జాతీయ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ విజయ్‌ సంప్లాకు అఖిల భారత ఎస్సీ, ఎస్టీ సంఘాల సమాఖ్య ఫిర్యాదు

పంజాగుట్టలో అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం అడ్డంకులు

ఎస్సీ కమిషన్‌కు అఖిల భారత ఎస్సీ, ఎస్టీ సమాఖ్య ఫిర్యాదు


న్యూఢిల్లీ, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని పంజాగుట్ట కూడలిలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వడం లేదని జాతీయ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ విజయ్‌ సంప్లాకు అఖిల భారత ఎస్సీ, ఎస్టీ సంఘాల సమాఖ్య ఫిర్యాదు చేసింది. మాజీ ఎంపీ ఉదిత్‌ రాజ్‌, సమాఖ్య తెలంగాణ అధ్యక్షుడు మహేశ్వర్‌ రాజ్‌ మంగళవారం ఢిల్లీలో కమిషన్‌ చైర్మన్‌ను కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మహేశ్వర్‌ రాజ్‌ మాట్లాడారు. విగ్రహాన్ని తొలగించి అధికారులు చివరకు దాన్ని చెత్తకుప్పలో వేశారని తెలిపారు. ఈ చర్య వెనుక సీఎం కేసీఆర్‌ ఉన్నారని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద సీఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీఎంను అరెస్టు చేయాలని కమిషన్‌ను కోరామన్నారు. ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్‌కు సమన్లు జారీ చేసి ఢిల్లీకి పిలిపించి ప్రశ్నించాలని అభ్యర్థించామని ఆయన వెల్లడించారు. 

Updated Date - 2021-06-23T10:12:30+05:30 IST