భూ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2022-01-21T06:20:40+05:30 IST

భూ సమస్యలు పరిష్కరిం చడంలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి అయిలయ్యయాదవ్‌ విమర్శించారు.

భూ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
సమావేశంలో మాట్లాడుతున్న అయిలయ్య

సంస్థాన్‌నారాయణపురం, జనవరి 20: భూ సమస్యలు పరిష్కరిం చడంలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి అయిలయ్యయాదవ్‌ విమర్శించారు. మండలకేంద్రంలో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. భూ ప్రక్షాళన పేరుతో ఆర్భాటంగా సభలు సమావేశాలు నిర్వహించి రైతుల సమ స్యలు పరిష్కరించింది శూన్యమని విమర్శించారు. తరతరాలుగా ఉన్న రైతులు భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన ధరణి పోర్టల్‌ సమస్యలు తీర్చకపోగా కొత్త సమస్యలు సృష్టించి రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. ధరణి రాకముందుకు రైతులకు ఉండే చిన్న చిన్న భూ సమస్యలు గ్రామ, మండల స్థాయిలో పరిష్కారం అయ్యేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. విశేష అధికారాలు ఉన్నా తహసీల్దార్లను కేవలం సబ్‌ రిజిస్టార్లుగా మార్చిందన్నారు. టీఆర్‌ఎస్‌  ప్రభుత్వం ఉన్న సమస్యలను పరిష్కరించకపోగా కొత్త సమస్యలను సృష్టించి రైతులను అయోమయానికి గురి చేస్తుందన్నారు. ధరణిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై గ్రామస్థాయిలో గ్రామ సభలు నిర్వహించి తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఏర్పుల సుదర్శన్‌, నాయకులు ముత్యాల విజయ్‌కుమార్‌, బద్దుల యాదగిరి, సామ రాంరెడ్డి, రేవనవెల్లి గోపాల్‌, ముత్యాల నరసింహ, పగిల్ల రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-21T06:20:40+05:30 IST