Advertisement
Advertisement
Abn logo
Advertisement

బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

- మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

నల్లమాడ , నవంబరు 30: రాష్ట్ర వ్యాప్తంగా వరద బాధితులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. మంగళవారం మండలంలోని పులగం పల్లిలో ఇటీవల కురిసిన వర్షాలకు ఇల్లు దెబ్బతిని నష్టపోయిన బాధితు లను మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పరామర్శించి, 105 కుటుం బాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు వరి, వేరుశనగ పంటలు దెబ్బతినడంతో పాటు ఇళ్ళలోకి నీరు చేరి, చాలా మంది నిరాశ్రయులు అయ్యారన్నారు. వీరికి పరామర్శించి, ఆదుకో వాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. వన్‌టైం సెటిల్‌మెంట్‌ పేరుతో ప్రజల నుండి రూ. 10 వేలు వసూలు చేస్తు న్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ ప్రాంత ప్రజలకు ఉచితంగా ఇంటి పట్టాలు రిజిస్ట్రేషన్‌ చేయి స్తామ న్నారు. ఈ కార్యక్రమంలో పులగంపల్లి సర్పంచు ప్రభాకర్‌రెడ్డి, గంగిరె డ్డి, అశ్వక్‌ఖాన్‌, రమేష్‌నాయుడు, గంగప్ప, నరసింహులు నాయుడు, బోస్‌రెడ్డి, చాంద్‌బాషా, మండల కన్వీనర్‌ మైలే శివశంకర్‌, గుండ్ర శివారెడ్డి, గంగులప్పనాయుడు, వెంకటరమణనాయుడు, అంజి, రామ ప్ప తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement