ఉద్యోగుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత

ABN , First Publish Date - 2022-01-23T04:36:40+05:30 IST

ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆత్మహత్యలకు ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నాయకులు, ఎమ్మెల్సీలే బాధ్యులని తపస్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి అన్నారు.

ఉద్యోగుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత
సమావేశంలో పాల్గొన్న తపస్‌ సంఘం నాయకులు

అయిజ, జనవరి 22: ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆత్మహత్యలకు ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నాయకులు, ఎమ్మెల్సీలే బాధ్యులని తపస్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి అన్నారు. శనివారం అయిజ పట్టణంలోని వీఆర్‌ ఉన్నత పాఠశాలలో తపస్‌ ఉపాధ్యాయ సం ఘ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సర్దుబాటులో భాగంగా ప్రభుత్వం 317 జీవో తీసుకురావటం తో ఉద్యోగులు ఆత్మన్యూనతకు గురై ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘ నాయకులు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. జీవో రద్దు చేసి తిరిగి ఉద్యోగులకు న్యాయం చేయాలని లేనిచో హక్కుల కోసం ఉద్యమించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు కర్రెప్ప, ప్రధాన కార్యదర్శి నందికుమార్‌, ఉపాధ్యక్షుడు అశోక్‌కుమార్‌, కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్‌, హరీశ్‌ కుమార్‌ రెడ్డి, కృష్ణ, మధుకుమార్‌, చంద్ర, రామాంజనేయులు, రామకృష్ణ, జగదీష్‌, రంగస్వామి పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T04:36:40+05:30 IST