సంఘాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2021-10-18T06:26:15+05:30 IST

కుల సంఘాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి దిశగా నడి పిస్తోందని ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అన్నారు.

సంఘాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు

కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు

కోరుట్ల రూరల్‌, అక్టోబరు 17: కుల సంఘాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి దిశగా నడి పిస్తోందని ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అన్నారు. ఆదివారం మండలంలోని అయిలపూర్‌ గ్రామంలో ముదిరాజు సంఘ ఆధ్వర్యంలో రూ. 4 లక్షల డీఎంఎఫ్‌టీ నిధులతో నిర్మాణం చేసిన కళ్యాణ భవనాన్ని ఎమ్మెల్యే విద్యా సా గర్‌ రావు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మె ల్యే విద్యాసాగర్‌ రావుతో పాటు నాయకులను ముదిరాజు సంఘ నాయకులు ఘన స్వాగతం పలికి సన్మానం చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే  మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు అభివృద్ధిని చూపి ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేదని, రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్‌ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెలుతూ బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ పిడుగు రాధ - సందయ్య, రైలు సమన్వయ కమిటి జిల్లా అధ్యక్షుడు చీటి వెంకటరావు, జడ్‌పీటీసీ సభ్యురాలు దారిశెట్టి లావణ్య - రాజేష్‌, ఎంపీటీసీ సభ్యురాలు చింతకుంట వనిత - సంజీవ రెడ్డి, సహాకార సంఘ అధ్యక్షుడు సాయి రెడ్డి నాయకులు వెంకటస్వామి, అనంతస్వామి, గంగాధర్‌ గౌడ్‌లతో పాటు ముదిరాజు సంఘ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-18T06:26:15+05:30 IST