Advertisement
Advertisement
Abn logo
Advertisement

మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

తుక్కాపురం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని పరిశీలిస్తున్న డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

భువనగిరి రూరల్‌, డిసెంబరు 2: మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. భువనగిరి మండలం తుక్కాపురంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించి మాట్లా డారు. ప్రభుత్వ కొనుగోలు చేయనందునే వర్షాలకు తడిసి ఽధాన్యం మొలకెత్తిందన్నారు.  కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు బస్తాకు నాలుగు కిలోల తరుగు తీస్తూ రైతులకు నష్టం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం మొండి వైఖరిని వీడి రైతులను ఆదుకోవాలని, త్వరగా వరి ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ  మండల అధ్యక్షుడు  కోట పెద్దస్వామి, నాయకులు బింగి భిక్షపతి, ఆదినారాయణ, పాక వెంకటేశ్‌ యాదవ్‌ పాల్గొన్నారు. Advertisement
Advertisement