ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-12-08T05:48:15+05:30 IST

పీఆర్‌సీ అమలు, డీఏ మంజూరు, అరియర్స్‌ ఇవ్వాలని, సీపీఎస్‌ రద్దు చేయాలంటూ మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఏపీ ఎనజీవో సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు

ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి
ఓబుళదేవరచెరువులో ఉద్యోగుల నిరసన


నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన 

ఓబుళదేవరచెరువు, డిసెంబరు 7: పీఆర్‌సీ అమలు, డీఏ మంజూరు, అరియర్స్‌ ఇవ్వాలని, సీపీఎస్‌ రద్దు చేయాలంటూ మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఏపీ ఎనజీవో సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీఎనజీవో కదిరి తాలూకా ఉపాధ్యక్షురాలు కొత్తపల్లి ఇందిరమ్మ, జిల్లా ఉపాధ్యక్షుడు రవీంద్రారెడ్డి మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దు చేయడంతోపాటు పీఆర్‌సీ, అరియర్స్‌ సాధన కోసం ప్రతిఒక్కరు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ఽధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీహెచఈఓలు దేవలానాయక్‌, లాలూనాయక్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌ సూర్యనారాయణరెడ్డి, రసూల్‌, సిబ్బంది ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాసులు, ఆశ కార్యకర్తలు తారా, బషీరా, రాధా, ఉమాదేవీ, అనిత తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-08T05:48:15+05:30 IST