ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2022-01-17T03:48:41+05:30 IST

అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల సర్వేచేసి నష్టపరి హారం అందించి రైతులను ఆదుకోవాలని మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేష్‌ రాథోడ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం రేండ్లగూడలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పత్తి పంటలను పరిశీలించారు.

ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి
పత్తి పంటను పరిశీలిస్తున్న మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేష్‌ రాథోడ్‌

జన్నారం, జనవరి 16: అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల సర్వేచేసి నష్టపరి హారం అందించి రైతులను ఆదుకోవాలని మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేష్‌ రాథోడ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం రేండ్లగూడలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పత్తి పంటలను పరిశీలించారు. వడగండ్ల వర్షానికి పత్తి పూర్తిగా దెబ్బతిన్నదని, వ్యవసాయాధికారులు ప్రభుత్వానికి నివేదికలు అందించాలని సూచించారు. ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఇటీవల ఇందన్‌పల్లి గోండుగూడ గ్రామానికి చెందిన లింగుప టేల్‌, చింతగూడకు చెందిన బానవత్‌ సాలిబాయ్‌లు మృతిచెందగా వారి కుటుంబాలను పరామర్శించారు. బీజేపీ మండల అధ్యక్షుడు గోలి చందు, జిల్లా కార్యదర్శి శంకరయ్య, మండల ప్రధాన కార్యదర్శి సురేష్‌, ఎంపీటీసీ మధుసూ దన్‌రావు, మాజీ సర్పందచు బద్రినాయక్‌, నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-17T03:48:41+05:30 IST