రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

ABN , First Publish Date - 2021-12-01T04:44:52+05:30 IST

రుగాలం కష్టించి పండించిన ఖరీఫ్‌ ధా న్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతాం గాన్ని ఆదుకోవాలని ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి కందికొండ గీత డిమాండ్‌ చేశా రు.

రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఐద్వా రాష్ట్ర కార్యదర్శి కె.గీత

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, నవంబరు 30: ఆరుగాలం కష్టించి పండించిన ఖరీఫ్‌  ధా న్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతాం గాన్ని ఆదుకోవాలని ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి కందికొండ గీత డిమాండ్‌ చేశా రు. మంగళవారం జిల్లా కేంద్రంలో సీఐటీ యూ కార్యాలయంలో ఐద్వా ముఖ్య నా యకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ చేతికొచ్చి న పంట తడిసి ముద్దవుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగవులాడుతూ రైతుల ను నట్టేట ముంచుతున్నాయని ఆరోపిం చారు. వేల కోట్ల వెచ్చించి కేఎల్‌ఐ, కోయిల్‌ సాగర్‌, నెట్టెంపాడు రిజర్వాయర్లు నిర్మించి వాటి వెనుక సాగు చేసిన ధాన్యాన్ని ప్రభుత్వాలు కొనుగోలు చేయకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరి స్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రభుత్వాలు మొండి వైఖరి వీడి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభిం చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు శోభ, సునీత, నిర్మల  పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-01T04:44:52+05:30 IST