Abn logo
Sep 23 2021 @ 00:29AM

అనాథ పిల్లల సంరక్షణకు ప్రభుత్వం చేయూత

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ పర్వీన్‌

- జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ పర్వీన్‌

సుల్తానాబాద్‌, సెప్టెంబరు 22: అనాథ పిల్లల సంరక్షణ కోసం వారి చదువుల బాధ్యతను, భవిష్యత్తును ప్రభుత్వం చూసుకుంటుందని చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ పర్వీన్‌ అన్నారు. వారి కోసం ప్రవేశపెట్టిన పలు పథకాలను సద్వినియోగం చేసుకో వాలన్నారు. మండలంలోని చిన్నకలువల గ్రామపంచాయతీలో బుధవారం ఏర్పాటు చేసిన బాలల పరిరక్షణ కమిటీ సమావేశంలో పర్వీన్‌ మాట్లాడుతూ బాల్యవివాహాల ను అడ్డుకోవాలని, అనాథల వివరాలు తమకు ఇవ్వాలన్నారు. చిన్నపిల్లలపై అమా నుషంగా వ్యవహరించే సంఘటనలు వెంటనే తమ దృష్టికి తేవాలని లేదా 1098 టోల్‌ ఫ్రీ ద్వారా సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో బాలల పరిరక్షణ కమిటీ జిల్లా ప్రతినిధి కాంపల్లి శ్యామల, సర్పంచ్‌ ఏరుకొండ రమేష్‌, అంగన్‌వాడీ లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.