మోచి కుల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేయాలి

ABN , First Publish Date - 2021-10-25T04:17:44+05:30 IST

మోచి కుల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేయాలి

మోచి కుల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేయాలి
గజ్వేల్‌లో నిర్వహించిన సమ్మేళనంలో పాల్గొన్న మోచి సంఘం నాయకులు

గజ్వేల్‌, అక్టోబరు 24 : మోచి కుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని 57 ఎస్సీ ఉపకులాల పోరాట సమితి అధ్యక్షుడు బైరి వెంకటేషం అన్నారు. ఆదివారం గజ్వేల్‌ పట్టణంలో నిర్వహించిన తెలంగాణ మోచి కులస్తుల రాష్ట్రస్థాయి ఆత్మీయ సమ్మేళన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మోచి కుల అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దళితబంధులో మోచి కులస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలు బ్యాంకు ష్యూరిటీ లేకుండా ఇవ్వాలని, డబల్‌ బెడ్‌ రూమ్‌ కేటాయింపులో మోచి కులస్తులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని వారు తెలిపారు. ఈ సందర్భంగా మోచి సంఘం రాష్ట్ర నూతన  కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. గౌరవ అధ్యక్షుడిగా బైరి వెంకటేశం (సిద్దిపేట), రాష్ట్ర అధ్యక్షుడిగా రాచర్ల రాజు దశరథ్‌ (పెర్కిట్‌), ప్రధాన కార్యదర్శిగా ఓటరికారి వేణుగోపాల్‌ (గజ్వేల్‌), కోశాధికారిగా బైరి మహేష్‌ (కోరుట్ల), జాయింట్‌ సెక్రటరీగా బైరి యాదగిరి, హుస్నాబాద్‌ ఉపాధ్యక్షులుగా బైరి శ్రీనివాస్‌, కొండ్లపు ప్రభాకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఓటరికారి యాదగిరి, రమేష్‌, రాష్ట్రంలోని మోచి కుల సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-25T04:17:44+05:30 IST