Abn logo
Sep 24 2021 @ 00:44AM

అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

దొంగతుర్తిలో మాట్లాడుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌

- మంత్రి కొప్పుల ఈశ్వర్‌  

- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ధర్మారం, సెప్టెంబర్‌ 23: అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చే స్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ప్రజా సమస్యల ను సీఎం కేసీఆర్‌ క్షేత్ర స్థాయిలో తెలుసు కుని వారికి అనుగుణంగా పథకాలను అమలుచేస్తుందని ఆయన చెప్పారు. గురువారం ధర్మారం మండలం ఖిలావన పర్తిలో పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటే ష్‌తో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం దొంగతుర్తి గ్రామంలో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించా రు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈ శ్వర్‌ మాట్లాడుతూ.. ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ బృహాత్తరమైన సం క్షేమ పథకాలను రూపొందించి అమలుచేస్తున్నారన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా పథకాలను అమలు చేసి ప్రథమ స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ము త్యాల కరుణశ్రీ. నందిమేడారం సింగిల్‌విండో చైర్మన్‌ ముత్యాల బల రాంరెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, సర్పంచ్‌ సాగంటి తారకొండ య్య తదితరులు పాల్గొన్నారు. మండలంలోని ఖిలావనపర్తి గ్రామం లో ప్రభుత్వ ఆరోగ్య ఉపకేంద్రం భవన, చర్చి ప్రహరీ నిర్మాణానికి ఎంపీ వెంకటేష్‌ నేతతో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ శంకుస్థాపన చేశారు. దొంగతుర్తి గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంత రం ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశా రు. పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, ఎం పీడీవో జయశీల, తహసీల్దార్‌ వెంకటలక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు దాడి సదయ్య తదితరులు పాల్గొన్నారు.