Advertisement
Advertisement
Abn logo
Advertisement

పంట నష్టపోయాం ప్రభుత్వం డబ్బులు ఇవ్వడంలేదు

కృష్ణా: ఉంగుటూరు మండలం ఆముదాలపల్లి గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. 2012 లో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సర్కారులో బుడమేరు కాలువకు తమ భూములు తీసుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.  రైతులు అభివృద్ధి కోసమని స్వచ్ఛందంగా తమ భూములు ఇచ్చామంటున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా తమకు మాత్రం న్యాయం జరగడం లేదని వాపోతున్నారు. తొంభైమూడు మంది రైతుల వద్ద నుంచి పంట పొలాల్ని బుడమేరు కాలువ డెవలప్‌మేంట్ కోసం ఇరిగేషన్ అధికారులు తీసుకున్నారన్నారు. రాజధానికి ,నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం, జిల్లా కలెక్టర్ వద్దకు ఎన్ని సార్లు తిరిగిన ప్రయోజనం లేక పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తమకు మొత్తం రావలసిన సొమ్ము రూ.6 కోట్ల 56 లక్షల ఇవ్వాల్సిందిగా రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామన్నారు. పోలవరం కాలువ‌కు ముందే డబ్బులు ఇచ్చి రైతుల వద్ద ఫలాలు తీసుకున్న ప్రభుత్వం మా విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నారని  రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. 2018 సంవత్సరంలో టోకెన్లు ఇచ్చి ఇరిగేషన్ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 9 సంవత్సరాల పంట నష్టపోయాం,ప్రభుత్వం డబ్బులు ఇవ్వడంలేదని ఆముదాలపల్లి రైతులు కంటతడిపెట్టారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement