సుప్రీంలో కృష్ణా ట్రిబ్యునల్ పిటిషన్‌‌ను ఉపసంహారించుకున్న తెలంగాణ

ABN , First Publish Date - 2021-06-12T00:05:05+05:30 IST

కృష్ణా ట్రిబ్యునల్ అవార్డుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్‌‌ను సుప్రీం కోర్టులో దాఖలు చేసింది.

సుప్రీంలో కృష్ణా ట్రిబ్యునల్ పిటిషన్‌‌ను ఉపసంహారించుకున్న తెలంగాణ

ఢిల్లీ: కృష్ణా ట్రిబ్యునల్ అవార్డుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్‌‌ను సుప్రీం కోర్టులో దాఖలు చేసింది. కేంద్రం హామీ మేరకు రీట్ పిటిషన్ ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సుప్రీం కోర్టులో ఉపసంహారణకు దరఖాస్తు చేసింది. విభజన‌కు ముందు మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణట్రిబ్యూనల్ నీటి కేటాయింపులు జరిపిన విషయం తెలిసిందే. కాగా నీటి కేటాయింపులో తెలంగాణ‌కు అన్యాయం జరిగిందని సుప్రీం కోర్టులో  తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. కృష్ణ నదిజలాలు నాలుగు రాష్టాలకు సమాన వాటా అందించేలా సుప్రీం కోర్టు చూడాలని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌లో డిమాండ్ చేసింది. పిటిషన్ ఉపసంహారణకు మళ్లీ కృష్ణట్రిబ్యూనల్‌కు కొత్త విధివిధానాలు రూపొందిస్తామని కేంద్రం స్పష్టం చేయడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2021-06-12T00:05:05+05:30 IST