మానవ అక్రమ రవాణాను అరికట్టాలి: గవర్నర్‌

ABN , First Publish Date - 2021-07-31T08:58:35+05:30 IST

మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి సమష్టిగా కృషి చేయాలని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పిలుపునిచ్చారు. డ్రగ్స్‌, ఆయుధాల అక్రమ రవాణా తర్వాత ప్రపం చంలో మూడో అతిపెద్ద వ్యవస్థీకృత నేరం ఇదేనని ఆమె ఆవేదన వ్యక్తం

మానవ అక్రమ రవాణాను అరికట్టాలి: గవర్నర్‌

అంగన్‌వాడీలు సోషల్‌ పోలీస్‌గా పనిచేయాలి: మంత్రి సత్యవతి రాథోడ్‌


హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, జూలై 30 (ఆంధ్రజ్యోతి): మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి సమష్టిగా కృషి చేయాలని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పిలుపునిచ్చారు. డ్రగ్స్‌, ఆయుధాల అక్రమ రవాణా తర్వాత ప్రపం చంలో మూడో అతిపెద్ద వ్యవస్థీకృత నేరం ఇదేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రజ్వల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రచురించిన ‘కౌంటరింగ్‌ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌’ అనే ఐదు రకాల హ్యాండ్‌ బుక్స్‌ను శుక్రవారం గవర్నర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాలో 46 శాతం మంది మహిళలు, 19 శాతం మంది బాలికలు బాధితులవుతున్నారని వివరించారు. అక్రమ రవాణా నిరోధానికి సునీతా కృష్ణన్‌ చేస్తున్న కృషిని గవర్నర్‌ అభినందించారు. కాగా,  మానవ అక్రమ రవాణా అరికట్టేందుకు అంగన్‌వాడీలు సోషల్‌ పోలీస్‌గా పనిచేయాలని గిరిజన, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని  మా ట్లాడుతూ మానవ అక్రమ రవాణా ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాదన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖలో 70-80 వేల ఉద్యోగులు ఉన్నారని వీరంతా కలిసి రాష్ట్రంలో మహిళలు, పిల్లలకు గ్రామ స్థాయిలో రక్షణ కవ చంగా పనిచేయాలని మంత్రి సూచించారు.

Updated Date - 2021-07-31T08:58:35+05:30 IST