యంత్రాంగం అప్రమత్తం

ABN , First Publish Date - 2021-02-23T05:59:47+05:30 IST

పొరుగున గల మహారాష్ట్రలో కరోనా ఉధృతి మళ్లీ పెరగ డంతో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చే సేందుకు నిర్ణయించింది. మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి టె స్టులు చేసిన తర్వాతనే జిల్లాలోకి అనుమతించే విధంగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

యంత్రాంగం అప్రమత్తం

మహారాష్ట్రలో కరోనా కేసులు పెరగడంతో అప్రమత్తమైన ఉమ్మడి జిల్లా అధికారులు

సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : పొరుగున గల మహారాష్ట్రలో కరోనా ఉధృతి మళ్లీ పెరగ డంతో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చే సేందుకు నిర్ణయించింది. మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి టె స్టులు చేసిన తర్వాతనే జిల్లాలోకి అనుమతించే విధంగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రజలు కూడా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. కరోనా నివారణకు నిబంధనలు పాటించాలని వై ద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో టె స్టులు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. 

రవాణాపై అధికారుల దృష్టి

మహారాష్ట్రలో కరోనా ఉధృతి పెరగడంతో నాందేడ్‌ జిల్లా మీదుగా ఉమ్మడి జిల్లాకు రాకపోకలు ఉండడంతో అధికారులు దృష్టిపెట్టారు. సరిహద్దు జిల్లా అయిన నాందేడ్‌లో కూ డా కేసులు ఎక్కువగా ఉండడంతో ముందస్తు చర్యలు చేపట్టారు. అక్కడ ప్రతీరోజు కేసులు పెరుగుతుండడంతో ఉ మ్మడి జిల్లా పరిధిలోని ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. జిల్లాలో కూడా ప్రతీరోజు కొత్త కేసులు వస్తుండడంతో ము ందస్తు చర్యలు చేపట్టారు. మహారాష్ట్ర నుంచి జిల్లాకు వచ్చే ప్రధాన దారులైన సాలూరా, మద్నూర్‌ మండలం సలాబత్‌పూర్‌ వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ చెక్‌పోస్టుల వద్ద మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి టెస్టులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టె స్టుల్లో పాజిటివ్‌ తేలితే వారిని తిరిగి పంపించే విధంగా ఏ ర్పాట్లు చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో సరిహద్దులతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా ఏర్పాట్లు చేసేందుకు నిర్ణ యం తీసుకున్నారు. మహారాష్ట్రలో కేసులు భారీగా పెరగ డం, అక్కడి నుంచి ప్రతీరోజు ఉమ్మడి జిల్లాకు ఎక్కువ మంది వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా మీదుగా ఎక్కువ మంది రాష్ట్ర రాజధానికి కూడా వా హనాల వస్తుండడంతో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉం డడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని బస్టాండ్‌లలోకూడా టెస్టులను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఉభయ జిల్లా కలెక్టర్‌లు వైద్యాధికారులతో సమీక్షించి కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కేసులు..

ఉమ్మడి జిల్లాలో కరోనా పూర్తిగా తగ్గడం లేదు. ప్రతీ రోజు కొన్ని కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి. టెస్టుల సం ఖ్య తగ్గినా కేసులు మాత్రం తగ్గడంలేదు. నిత్యం 10 ను ంచి 20 వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రతీరోజు 200ల నుంచి 400 వందల వరకు పరీక్షలు నిర్వ హిస్తున్నారు. ఎక్కువ మంది పరీక్ష కేంద్రాలకు రాకపోవడం వల్ల టెస్టులను తగ్గించారు. నిజామాబాద్‌ జిల్లా లో ఇప్పటి వరకు 15,780 కరోనా కేసులు నమోదయ్యా యి. వీరిలో 85శాతానికిపైగా మంది హోం క్వారంటైన్‌ లో ఉండి చికిత్స పొందారు. కామారెడ్డి జిల్లా పరిధిలో 13,624 కేసులు నమోదయ్యాయి. గడిచిన రెండు నెలలుగా కొత్త కేసులు నమోదవుతున్నా అధికారులు అం తగా దృష్టిపెట్టడంలేదు. గతంలోలాగా క్వారంటైన్‌ నిబ ంధనలు అమలు చేయడంలేదు. పాజిటివ్‌ వచ్చినవా రు హోం క్వారంటైన్‌లో ఉన్నారా? లేరా? అనే పరిశీలన కూడా తగ్గింది. కేసులు కొంతమేర తగ్గడం వల్ల వైధ్యా ఆరోగ్యశాఖ అధికారులు కూడా అంతగా దృష్టిపెట్టడంలేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధిలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోంది. కరోనా వారియర్స్‌ అయిన వైద్య సిబ్బందికి  నెల క్రితం ఫస్ట్‌డోస్‌ ఇవ్వగా వారందరికీ సెకండ్‌ డోస్‌ను కొనసాగిస్తున్నారు. వీరికి పూర్తయిన తర్వాత ఇతరులకు కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చేం దుకు ఏర్పాట్లు చేయనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధి లో ఇంకా కరోనా కేసులు నమోదవుతున్నాయని నిజా మాబాద్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సు దర్శన్‌ తెలిపారు. మహారాష్ట్రలో కేసులు పెరుగుతు న్నందున సరిహద్దుల వద్ద టెస్టులు నిర్వహించేందు కు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజ లు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. 

Updated Date - 2021-02-23T05:59:47+05:30 IST