కల్లాల్లోనే వరిధాన్యం

ABN , First Publish Date - 2021-05-17T06:07:42+05:30 IST

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనేవారు లేక శింగనమల చెరువు ఆయకట్టు వరి రైతులు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం.

కల్లాల్లోనే వరిధాన్యం
కొనుగోళ్లు లేకపోవడంతో కల్లాల్లోనే ధాన్యం ఉంచిన రైతులు

 రెండు వారాలుగా అక్కడే బస 

 కొనేవారు లేక ఆందోళనలో రైతులు

 ప్రభుత్వమే గిట్టుబాటు ధరతో

కొనుగోలు చేయాలని వేడుకోలు

శింగనమల, మే16 : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనేవారు లేక శింగనమల చెరువు ఆయకట్టు వరి రైతులు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. మే నెల 3వ తేదీ నుంచి కోతలు ప్రారంభమయ్యాయి. రైతులు ధాన్యాన్ని తీసి కల్లాల్లోనే కుప్పలు పోశారు. ఇప్పటికి రెండో వారం గడుస్తున్నా... కల్లాల్లోనే ధా న్యం ఉండిపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. చెరువు ఆయకట్టు కింద అధికారికంగా 2500 ఎకరాల్లో, అనధికారికంగా మరో 1000 ఎకరాల్లో వరిసాగు చేశారు. ప్రస్తుతం కోతలు కోసి ధాన్యం రాశి పోసే వరకు పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఈ ఆయకట్టు కింద శింగనమల, శివపురం, సీ బండమీ దపల్లి, చక్రాయపేట, పోతురాజు కాలువ, పెరవలి, గోవిందరాయుని పేట, సోదనపల్లి గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు వరి సాగుచే శారు. దాదాపు 100 మెట్రిక్‌ టన్నుల వరకూ ధాన్యం దిగుబడి వచ్చిందని అధి కారులు అంచనా వేశారు. ధాన్యాన్ని ఇప్పటి వరకూ ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు 83కిలోల బస్తా రూ. 1030 నుంచి రూ. 1050 పెట్టి అతి తక్కువ ధరతో అరొకరగా కొనుగోలు చేస్తున్నారు. కొందరు రైతులు విధిలేక సాగు పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు తీర్చేందుకు ఆ ధరకే అమ్మేస్తున్నారు. అయితే 75 కిలోల ధాన్యం బస్తా మద్ధతు ధర రూ. 1416 ఉండగా... దళారులు రూ. 1100లోపే అడుగుతున్నారు. దీంతో రైతులకు ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. అదికూడా దళారులు రైతుల వద్ద నుంచి అరకొర గానే కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడం, కరోనా ప్రభావంతో ధాన్యం ధర తగ్గిపోయింది. పైగా వర్షాలు కురిస్తే ధాన్యం మొలకెత్తే అవకాశం ఉం ది. ఏమి చే యాలో దిక్కుతోచని రైతులు కల్లాల్లోనే ధాన్యం పోసుకుని అమ్ముకోవడానికి ఎదురు చూస్తున్నారు. ఎవరూ రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.


Updated Date - 2021-05-17T06:07:42+05:30 IST