ధాన్యంలో తాలు లేకుండా తేవాలి

ABN , First Publish Date - 2021-10-22T05:13:56+05:30 IST

రాష్ట్ర ప్రభు త్వం రైతుల కోసం ప్రారం భించిన కొనుగోలు కేంద్రాలకు తాలు లేకుండా వరిధాన్యా న్ని తీసుకువచ్చి మద్ద తు ధర పొందాలని రా ష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి రైతులను కోరారు.

ధాన్యంలో తాలు లేకుండా తేవాలి
కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి



ఎఫ్‌సీఐ నిబంధనలు పాటించాలి  
రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

వేల్పూర్‌, అక్టోబరు 21: రాష్ట్ర ప్రభు త్వం రైతుల కోసం ప్రారం భించిన కొనుగోలు కేంద్రాలకు తాలు లేకుండా వరిధాన్యా న్ని తీసుకువచ్చి మద్ద తు ధర పొందాలని రా ష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి రైతులను కోరారు. గు రువారం వేల్పూర్‌ పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన సొంత గ్రామం వేల్పూర్‌లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రా ష్ట్రంలో రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభు త్వాన్ని ఒప్పించి తెలంగాణ రాష్ట్రంలో రైతు లకు మద్దతు ధర ఏ గ్రేడ్‌ రకానికి రూ. 1960, సాధారణ రకానికి రూ.1940ఇచ్చే వి ధంగా జిల్లాలో 467 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటకలో కొనుగోలు కేంద్రం లేకపోవడం వల్ల ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో అక్కడి రైతు లు వరిధాన్యం రూ.1200నుంచి రూ.1300లకే పోటీ పడి షావుఖార్‌లకు అమ్ముకుంటున్నారన్నారు. జిల్లా రైతులు తాలు లేకుండా ఎఫ్‌సీఐ నిబంధనలు పాటించి ధాన్యాన్ని కేంద్రానికి తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని కోరారు. వరిధా న్యం కొనుగోలు కేంద్రాలపై రాజకీ యాలు మానుకోవాన్నారు. కార్యక్ర మంలో అదనపు కలెక్టర్‌ చంద్ర శేఖర్‌, డీసీసీబీ వైస్‌చైర్మన్‌ రమేష్‌ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు, జేడీఏ గోవింద్‌, తహసీల్దార్‌ సతీష్‌రెడ్డి, ఎంపీడీవో కమలాకర్‌రావు, డీటీ రాజశేఖర్‌, వేల్పూర్‌ ఏఎంసీ చైర్మన్‌ కొట్టాల చిన్నారెడ్డి, ఎంపీపీ బీమ జమున రాజేందర్‌, జడ్పీటీసీ అల ్లకొండ భారతి, స్థానిక సర్పంచ్‌ తీగెల రాధామోహన్‌, పార్టీ మండలాధ్యక్షుడు జైడి నాగాధర్‌రెడ్డి, ఎంపీటీసీ మహేష్‌, సొసైటీ చైర్మన్‌ రాజారెడ్డి, మోహన్‌రెడ్డి, మోతె రాజేశ్వర్‌, యాల్ల హన్మంత్‌రెడ్డి, మండల ఆత్మకమిటీ చైర్మన్‌ రవీందర్‌, వైస్‌చైర్మన్‌ బైరి శ్రీధర్‌, సొసైటీ డైరెక్టర్‌లు, మండల గ్రామాల ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్‌వన్‌ : మంత్రి
సమైక్యాంధ్రలో అరి గోసపడ్డ తెలంగాణ నేడు దేశంలోనే అన్ని రంగాల్లో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉం దని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గురు వారం బాల్కొండ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ పార్టీ నూత న కమిటీ సభ్యులతో ఆయన సమావేశమ య్యారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడు తూ నాడు ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ నాయకత్వం లో కొద్ది మందితో మొదలై నేడు అతిపెద్ద పార్టీగా టీఆర్‌ఎస్‌ అవతరించిందన్నారు. కేసీఆర్‌ నాయ కత్వం లోని రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు. రైతులు, పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్ర తెలంగాణే అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అబద్దాలను ప్రచారం చేస్తున్నారని, వాటిని సరియైన రీతిలో తిప్పికొట్టాల న్నారు. తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌పీఎస్‌సీ ద్వారాని 39వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, ఇతర ప్రభుత్వ శాఖల్లో కలిపి మొత్తం లక్షా 30వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఇటీవలే నిర్మించిన చెక్‌డ్యాంల కట్టలు గట్టిపడకముందే భారీ వర్షాలకు కోతకు గురయ్యా య ని, ప్రకృతి విపత్తును ఎవరూ ఊహించారని, కనీసం జ్ఞానం లేకుండా ఎంపీ అర్వింద్‌ మాట్లాడుతు న్నార న్నారు. నవంబరు 15న వరంగల్‌లో జరిగే టీఆర్‌ఎస్‌ పార్టీ బహిరంగ సభకు ప్రతీ గ్రామం నుంచి ఒక బ స్సు బయలుదేరాలని, అందుకు ప్రతీ కార్యకర్త బాధ్య తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో డీసీసీబీ వైస్‌చైర్మన్‌ రమేష్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయ కుడు ఎంజె.మధుశేఖర్‌, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T05:13:56+05:30 IST