కరోనా కట్టడికి గ్రానైట్‌ పరిశ్రమ భారీ విరాళం

ABN , First Publish Date - 2020-04-08T10:16:41+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు కరీంనగర్‌ గ్రానైట్‌ అసోసియేషన్‌ సీఎం సహాయనిధికి భారీ విరాళాన్ని ప్రకటించింది. గ్రానైట్‌ అసోసియేషన్‌

కరోనా కట్టడికి గ్రానైట్‌ పరిశ్రమ భారీ విరాళం

కోటి రూపాయల విలువచేసే వైద్య పరికరాలు 

రూ. 75 లక్షల నగదు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెక్కు అందించిన ప్రతినిధులు 


కరీంనగర్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు కరీంనగర్‌ గ్రానైట్‌ అసోసియేషన్‌ సీఎం సహాయనిధికి భారీ విరాళాన్ని ప్రకటించింది. గ్రానైట్‌ అసోసియేషన్‌ నుంచి 50 లక్షలు, మార్వాడీ గ్రానైట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు 25 లక్షల నగదును, కోటి రూపాయల విలువ చేసే పరికరాలను చైనా నుంచి తెప్పించి ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం మంత్రులు గంగుల కమలాకర్‌, ఈటల రాజేందర్‌ సమక్షంలో గ్రానైట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పొన్నమనేని గంగాధర్‌రావు, అధ్యక్షుడు శ్రీధర్‌, మార్వాడీ గ్రానైట్‌ ఫ్యాక్టరీస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు గోపి మహేశ్వరి, రాజేశ్‌ అగర్వాల్‌, ముఖేశ్‌ పర్వాల్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హైదరాబాద్‌లో కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారిని ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు గంగుల కమలాకర్‌, ఈటల రాజేందర్‌ అభినందించారు. 

Updated Date - 2020-04-08T10:16:41+05:30 IST