ది గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్... అక్టోబరు 3 నుంచి ప్రారంభం...

ABN , First Publish Date - 2021-09-30T01:53:18+05:30 IST

వచ్చే నెల(అక్టోబరు 3 నుంచి ‘ది గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ పేరుతో అమెజాన్ సంస్థ మెగా మేళాను నిర్వహించనుంది. కిరాణా, ఫ్యాషన్, బ్యూటీ, స్మార్ట్‌ఫోన్లు, పెద్ద ఉపకరణాలు. టీవీలు, వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ తదితరాలతో పాటు వెయ్యి కొత్త ఉత్పత్తుల విడుదలలు ఈ మేళాలో ఉండనుంది.

ది గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్... అక్టోబరు 3 నుంచి ప్రారంభం...

హైదరాబాద్ : వచ్చే నెల(అక్టోబరు 3 నుంచి ‘ది గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ పేరుతో అమెజాన్ సంస్థ మెగా మేళాను నిర్వహించనుంది. కిరాణా, ఫ్యాషన్, బ్యూటీ, స్మార్ట్‌ఫోన్లు, పెద్ద ఉపకరణాలు. టీవీలు, వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ తదితరాలతో పాటు వెయ్యి కొత్త ఉత్పత్తుల విడుదలలు ఈ మేళాలో ఉండనుంది. హిందీలో వాయిస్ షాపింగ్... అలెక్సా ఆధారిత వాయిస్ షాపింగ్‌తో పాటు ఆంగ్లం, హిందీ భాషఫల్లో కూడా వినియోగదారులు తమ వాయిస్‌ను ఉపయోగించి షాపింగ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


అక్టోబరు 3 నుంచి ప్రారంభం కానున్న వార్షిక పండుగ కార్యక్రమం ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’  సందర్భంగా అమెజాన్ ఇండియా నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో భాగంగా వేల సంఖ్యలో కొత్త ఉత్పత్తులు అందుబాదటులో ఉండనున్నాయి. ఇందులో 450 నగరాలకు చెందిన 75 వేల వరకు స్థానిక దుకాణాలు.. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు తమ ప్రత్యేకమైన ఉత్పత్తుల ఎంపికను అందించనున్నాయి.  హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, గద్వాల్, మహబూబ్‌నగర్, విశాఖపట్నం,  తిరుపతితో సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన టాప్ ఇండియన్ మరియు గ్లోబల్ బ్రాండ్లను ఇందులో ప్రదర్శించనున్నారు. ఇక... ప్రైమ్ సభ్యులు ప్రారంభ యాక్సెస్‌ను ఆస్వాదించవచ్చు. అమెజాన్ ఇండియాలో 



లో సెల్లింగ్ పార్టనర్ సర్వీసెస్ డైరెక్టర్ సుమిత్ సహాయ్ మాట్లాడుతూ, “ఈ పండుగ సీజన్‌లో, తమ విక్రేతలు కొవిడ్-19 మహమ్మారితో ఇటీవల ఎదుర్కొన్న సవాళ్ల నుంచి పుంజుకునేందుకు మేము సహాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక తమ ఉత్పత్తులను ప్రదర్శించి,  విక్రయించేందుకు తెలంగాణలో 31 వేల  మంది, ఆంధ్రప్రదేశ్‌లో 5,100 మంది విక్రేతలు సిద్ధంగా ఉన్నారన్నారు. 


చిన్న వ్యాపారాలపై స్పాట్‌లైట్... 

ఈ ఏడాది, అమెజాన్.ఇన్ లో ఓ ప్రత్యేకమైన ‘స్మాల్ బిజినెస్ స్పాట్‌లైట్’ స్టోర్‌ను ప్రారంభించి, వినియోగదారులకు స్థానిక భారతీయ హస్తకళాకారుల నుంచి వారసత్వ చేనేత, హస్తకళల వంటి ప్రత్యేకమైన పండుగ ఎంపికలను వీక్షించి, భారతీయ డైరెక్ట్-టు-కన్స్యూమర్ స్టార్టప్‌ల నుంచి రోజువారీ ఆవిష్కరణలు, మహిళా పారిశ్రామికవేత్తలు, వారి విశ్వసనీయ ఆఫ్‌లైన్ నైబర్‌హుడ్ దుకాణాల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేసుకోవచ్చునని ఆయన వెల్లడించారు.  


తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి పోచంపల్లి వీవ్స్, గద్వాల్ వీవ్స్, పశ్చిమ బెంగాల్ నుంచి జమదానీ, ధోక్రా, పట చిత్ర, ఫుల్కారి దుపట్టా, పంజాబ్ మరియు హర్యానా నుంచి పంజాబీ జుట్టి, బ్రాస్‌వేర్, ఉత్తర ప్రదేశ్ నుంచి బనారసి, టెర్రకోట, చికంకారి తదితరాలను కార్మికులు, కళాకారుల నుంచి ప్రత్యేకమైన ఆర్ట్ మరియు క్రాఫ్ట్ ఉత్పత్తులను వినియోగదారులను కొనుగోలు చేసే వెసులుబాటు ఈ ఫెస్టివల్ లో ఉండనుంది. 


గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో శామ్‌సంగ్, ఒన్ ప్లస్, షవోమీ, సోనీ, యాపిల్, బోట్, లెనోవో, హెచ్‌పి, ఆసస్, ఫాజిల్, లెవిస్, బిబా, అలెన్ సోలీ, అడిడాస్, అమెరికన్ టూరిస్టర్, ప్రెస్టీజ్, యురేకా ఫోర్బ్స్, బాష్, పిజియన్, బజాజ్, బిగ్ మజిల్స్, లాక్మే, మేబెలైన్, ఫారెస్ట్ ఎసెన్షియల్స్, ది బాడీ షాప్, వావ్, నివియా, డాబర్, పి అండ్‌ జి, టాటా టీ, హగ్గీస్, పెడిగ్రీ, సోనీ పిఎస్5, మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్, హాస్బ్రో, ఫన్‌స్కూల్, ఫిలిప్స్, వేగా తదితర ప్రముఖ బ్రాండ్ల నుంచి 1,000కి పైగా కొత్త ఉత్పత్తులు అందుబాటులో ఉండనున్నాయి. 


Updated Date - 2021-09-30T01:53:18+05:30 IST